close
Choose your channels

జయరామ్ హత్య కేసు షాకింగ్ ట్విస్ట్: 23 ఛార్జిషీట్లు.. 12మంది నిందితులు

Monday, June 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జయరామ్ హత్య కేసు షాకింగ్ ట్విస్ట్: 23 ఛార్జిషీట్లు.. 12మంది నిందితులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో పోలీసులు 23 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. మొత్తం 73 మంది సాక్షులును విచారించి.. 12 మంది నిందితులను ఛార్జీషీటులో చేర్చారు. కాగా ఇందులో
ఛార్జిషీటులో నిందితులుగా ముగ్గురు పోలీస్ అధికారులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. హనీట్రాప్‌ ద్వారానే జయరామ్‌‌ను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది.

నిందితులు వీరే..

A1 రాకేష్ రెడ్డి

A2 విశాల్

A3 శ్రీనివాస్ (వాచ్ మాన్)

A4 నగేష్ (రౌడీషీటర్)

A5 సూర్య ప్రసాద్ (కమేడియన్)

A6 కిషోర్ (సూర్య ప్రసాద్ స్నేహితుడు)

A7 సుభాష్ రెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి)

A8 బిఎన్ రెడ్డి (టిడిపి నాయకుడు)

A9 అంజిరెడ్డి (రియల్ ఎస్టేట్ వ్యాపారి)

A10 శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్)

A11 రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్)

A12 మల్లారెడ్డి (ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ)

మొత్తం 73మంది సాక్షులు..

ఈ కేసులో మొత్తం 73 మంది సాక్షులను పోలీసులు విచారించారు.
12వ సాక్షిగా శిఖా చౌదరి, 

13 సాక్షిగా శిఖా బాయ్ ఫ్రెండ్ సంతోష్ రావ్‌ను విచారించి సంచలన విషయాలను పోలీసులు రాబట్టినట్టి తెలుస్తోంది. హనీ ట్రాప్‌తో జయరాంను పిలిపించి.. పిడిగుద్దులు గుద్ది మొహంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో రాకేష్ రెడ్డి తెలిపాడు. పోలీసుల సూచనతోనే మృతదేహం నందిగామకు తరలించినట్లు ఆయన ఒప్పుకున్నాడు.

విచారణలో నిగ్గు తేల్చిన విషయాలేంటి..!?

జయరాంను చిత్రహింసలు పెట్టి చంపామని.. ఈ మొత్తం తతంగాన్ని వీడియోలో చిత్రీకరించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. 11 వీడియోలు, 13 ఫొటోలు తీసినట్లు నిందితులు చెప్పారు. ఆస్పత్రికి తీసుకువెళ్ళమని ప్లీజ్.. ప్లీజ్ అని రాకేష్‌ను జయరామ్ పలుమార్లు ప్రాధేయపడినట్లు వీడియోలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతినెలా 50 లక్షలు ఇస్తామంటూ డాక్యుమెంట్స్‌ మీ దగ్గరే ఉంది. పాస్ పోర్టు మీ దగ్గరే పెట్టకుని నన్ను ప్రాణాలతో వదిలేయమని జయరాం బ్రతిమలాడినట్లు నిందితులు పోలీసు విచారణలో తేల్చి ఛార్జిషీటులో పేర్కొన్నారు. ‘వీణ’ పేరుతో లంచ్‌కు ఆహ్వానించి ఈ మొత్తం తతంగానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. జయరాం శరీరంలో ఎటువంటి విషపదార్దాలు లేవని పేర్కొన్న పోస్టుమార్టం రిపోర్ట్

రాకేష్‌కు జయరామ్‌కు ఎక్కడ పరిచయం..!

టెట్రాన్ కంపెనీ వివాదం తాను పరిష్కరిస్తానని జయరాంకు రాకేష్ పరిచయమయ్యాడు. అదే సమయంలో శిఖాతో రాకేష్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆ చనువుతో శిఖా-రాకేష్ సహజీవనం చేశారు. శిఖా- రాకేష్ రెడ్డి

జంటగా విదేశాల్లో జల్సాలు

చేశారు. అయితే రాకేష్ రెడ్డి మాత్రం శిఖా చౌదరిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. రాకేష్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని శిఖా.. తరచూ వాయిదా వేస్తూ వచ్చేది. శిఖా చౌదరిలో జల్సాల కోసం రాకేష్ కోట్లు ఖర్చుపెట్టాడు. రాకేష్‌తో సహజీవనం చేస్తూనే సాగర్ అనే మరో వ్యక్తితో శిఖా చౌదరి యూరప్ వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న రాకేష్.. శిఖాను నిలదీశాడు. సాగర్ గురించి అడగడంతో ఆగ్రహంతో రగిలిపోయిన శిఖా ఆయనతో కటీఫ్‌కు సిద్ధమైంది. ఈ తరుణంలో తనతో ఖర్చుపెట్టించుకున్న మొత్తం డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ రాకేష్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో శిఖాకు చెందిన బీఎండబ్లూ కారును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ వ్యవహారంలో ఎంటరయిన జయరామ్.. ఆ డబ్బులు మొత్తం తాను చెల్లిస్తానని రాకేష్‌కు హామీ ఇచ్చాడు. కిడ్నాప్‌కు స్కెచ్ వేసింది ఇక్కడే..! డబ్బులిస్తానని హామీ ఇచ్చిన జయరామ్‌కు పలుమార్లు రాకేష్ ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు. జయరామ్

ఇచ్చిన మాట తప్పాడని ఆగ్రహించిన రాకేష్.. కిడ్నాప్ చేయాలని స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో జయరాం రాకపోకలపై సమాచారం ఇవ్వాలని శిఖా చౌదరి వాచ్‌మెన్‌కు రాకేష్ డబ్బులు ముట్టజెప్పాడు. జనవరి 29న శిఖా చౌదరి ఇంటివద్ద నుంచి జయరాం కిడ్నాప్‌కు రాకేష్ రెడ్డి

ప్రయత్నించినప్పటికీ తృటిలో తప్పించుకున్నాడు. దీంతో ఆ స్కెచ్ విఫలమయ్యాక రాయదుర్గం సీఐ రాంబాబును కలిసిన మరో ప్లాన్‌ వేశాడు. ఒక ఫోన్ నంబరు నుంచి ‘వీణ’ అనే పేరుతో జయరాంకు మెసేజ్ చేశాడు. లంచ్‌కు కలుద్దామంటూ ‘హనీ ట్రాప్’ చేశాడు.

వీణ డ్రైవర్లమంటూ జయరాంను రాకేష్ ఇంటికి కమేడియన్ సూర్యప్రసాద్, కిషోర్ తీసుకెళ్లారు. అక్కడికెళ్లగానే జయరాం సెల్ ఫోన్లు లాక్కున్న రాకేష్ డబ్బులిస్తేనే వదిలి పెడతానని బెదిరించాడు. ఈ క్రమంలో డబ్బుల కోసం పలువురికి ఫోన్లు చేసిన జయరాం రూ.6 లక్షలు సర్దుబాటు చేశాడు.

దస్‌పల్లా హోటల్లోనే అంతా..!

దస్‌పల్లా హోటల్‌లో రాకేష్ అనుచరుడికి ఈశ్వరరావు అనే వ్యక్తి డబ్బులు ఇచ్చాడు. అయితే రాకేష్ మాత్రం ఇప్పటికిప్పుడు 50 లక్షలు కావల్సిందేనన్న పట్టుబట్టాడు. అంతేకాదు ఆఖరికి ఖాళీ స్టాంప్ పేపర్లపై జయరాం సంతకాలు తీసుకున్నాడు. అయితే ఛాతిలో నొప్పిగా ఉందని ఆస్పత్రికి తీసుకెళ్లాలని పదేపదే ప్రాధేయపడ్డాడు. అయితే రూ. 4.5 కోట్లు జయరాంకు అప్పు ఇచ్చినట్లు రాకేష్ రెడ్డి రాయించుకున్నాడు. 

ఈ అగ్రిమెంట్ తతంగం మొత్తం టీడీపీ నేత బీఎన్ రెడ్డి సమక్షంలో జరిగింది. మొదట సంతకాలు తీసుకుని అనంతరం జయరాంను హత్య చేయమని రౌడీషీటర్ నగేష్‌ను రాకేష్ రెడ్డి ఆదేశించాడు. అయితే తాను హత్య చేయనని నగేష్ మొండికేయగా.. ఆఖరికి నగేష్ బంధువు విశాల్ హత్య చేశాడు. ఈ విషయాన్ని రాయదుర్గం మాజీ సీఐ రాంబాబుకు ఫోన్‌లో రాకేష్ రెడ్డి వివరించాడు. అనంతరం జయరామ్ మృతదేహాన్ని

కారులో నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. అక్కడ మాజీ సీఐ శ్రీనివాసులుతో కలిసి మాట్లాడిన రాకేష్  అనంతరం పోలీసుల సలహాతో మృతదేహాన్ని ఏపీకి తరలించారు. కాగా ఆ తర్వాత జరిగిన తతంగం మొత్తం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.