close
Choose your channels

'24' సీక్వెల్ , బాలీవుడ్ హీరోల ఆసక్తి....

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

13బి`, ఇష్క్` చిత్రాలు తర్వాత మనం సూపర్ సక్సెస్ తో సౌతిండియన్ డైరెక్టర్స్ లో బెస్ట్ అనిపించుకున్న విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు సూర్య హీరోగా, నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24 సినిమాను నిర్మించారు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ సినిమా హైప్ ను మరింత పెంచాయి. సినిమా మే 6న విడుదల కానుంది. ఇప్పుడు ఈ 24 సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో విక్రమ్ కుమార్ ఉన్నాడట. అంతే కాకుండా 24 సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లు ఈ రీమేక్ లో నటిండానికి ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.