close
Choose your channels

Bigg Boss 7 Telugu : శివాజీ నస, బోర్ కొట్టించిన కంటెస్టెంట్స్ .. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

Tuesday, October 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా 5వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం రతికా రోజ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ జోరు మొదలైంది. కంటెస్టెంట్స్ అంతా అనర్హుడిగా ప్రకటించడంతో శివాజీని డీలక్స్ రూమ్ నుంచి వెళ్లిపోవాలంటూ బిగ్‌బాస్ ఆదేశించారు. దీంతో ఆయనకు బెడ్ ఎక్కడ ఇవ్వాలని శోభాశెట్టి , ప్రశాంత్ మాట్లాడుకుంటూ వుంటారు. ఇంతలో తేజ జోక్యం చేసుకోవడంతో మళ్లీ శివాజీ డీలక్స్ రూంలోకి వచ్చేశాడు. దీనిపై శోభాశెట్టి తేజతో గొడవ పెట్టుకోగా.. అతనిని జైల్లో వేశారు.

అనంతరం నామినేషన్స్ ప్రక్రియను షురూ చేశారు. కంటెస్టెంట్స్ అంతా గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. సరైన కారణం చెప్పి ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. శివాజీ.. అమర్‌దీప్, ప్రియాంక, ప్రియాంక.. శివాజీ, ప్రిన్స్ యావర్, గౌతమ్.. అమర్‌దీప్, శివాజీ, శుభశ్రీ.. అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్.. అమర్‌దీప్, ప్రియాంక, అమర్‌దీప్.. శుభశ్రీ, శివాజీ, తేజ.. గౌతమ్, ప్రిన్స్ యావర్‌లను నామినేట్ చేశారు. అయితే ప్రతివారం జరిగేంత హాట్ హాట్‌గా ఈవారం నామినేషన్స్ జరగలేదు. ఏదో పై పైన జరిగినట్లుగా అనిపించింది.

అయితే శివాజీ మరోసారి ఓవరాక్షన్ చేసి కంటెస్టెంట్స్‌కి తలబొప్పికట్టేలా చేశాడు. అమర్‌దీప్‌ను నామినేట్ చేస్తూ గొడవ పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా జులాయి సినిమా కథ చెప్పి అమర్‌దీప్ .. గేమ్‌లో ఒకడే బయటికి వస్తాడని చెప్పాడు. దీనికి శివాజీ తనదైన శైలిలో కౌంటర్ వేశాడు. రాజుగారి పెద్ద పెళ్లాం మంచిది అంటే చిన్నపెళ్లాం మంచిది అని కాదు అంటూ సామెత చెప్పాడు. తాను టైటిల్ గెలిచేందుకు రాలేదని, ప్రేక్షకుల మనసులను గెలిచేందుకు వచ్చానని శివాజీ పేర్కొన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాకముందే కంటెస్టెంట్స్ అంతా మాట్లాడుకుని వచ్చారని.. ఇప్పుడేమో ఫేక్ గేమ్ ఆడుతున్నారని శివాజీ ఆరోపించారు. ఈ కామెంట్స్‌ను బట్టి తాను ఎలాగూ గెలవను, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసి వెళ్తానని ఒప్పుకున్నాడా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మొత్తంగా ఈ వారం శివాజీ , తేజ, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, ప్రియాంక, గౌతమ్‌లు ఈ వారం నామేషన్స్‌లో వున్నారు. ఎపిసోడ్ ముగుస్తూ వుందనగా బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఇప్పటి వరకు పవర్ అస్త్ర కోసం కంటెస్టెంట్స్‌ మధ్య పోటీలు, టాస్క్‌లు జరిగాయని.. కానీ ఈసారి మాత్రం నిర్ణయం ప్రేక్షకులదేనని తేల్చిచెప్పాడు. ఓటింగ్ ఆధారంగా పవర్ అస్త్ర విజేతలను నిర్ణయిస్తామని తెలిపాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment