close
Choose your channels

అ ఆ టీజ‌ర్ అ ఆ

Wednesday, April 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనందవిహారి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అ ఆ టీజ‌ర్ ఈరోజు రిలీజ్ చేసారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న అ ఆ టీజ‌ర్ అ ఆ లా ఉంది. ఇదేమిటి అ ఆ లా ఉండ‌డం.. అనుకుంటున్నారా..? ఈ టీజ‌ర్ చూస్తే...ఈ సినిమా పై ఉన్న అంచ‌నాల‌ను ఆమాంతం పెంచేసేలా ఉంది అదీ సంగ‌తి.

ఈ స‌మ్మ‌ర్ లో కూల్ ఎంట‌ర్ టైన‌ర్ గా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అనిపిస్తుంది. సైలెంట్ గా అ ఆ తో వ‌చ్చి నితిన్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడ‌నిపిస్తుంది. మ‌రి..నితిన్ ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.