close
Choose your channels

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

Tuesday, December 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

గుడ్ మార్నింగ్.. హైదరాబాద్’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఈ పాట హౌస్‌మేట్స్‌లో ఫుల్ జోష్ నింపింది. అఖిల్ సోఫాలో కూర్చొని బాగా ఫీల్ అవుతున్నాడు. మోనాల్‌ను అఖిల్ ఎంతగా మిస్ అవుతున్నాడో తనని చూస్తే తెలుస్తోంది. హారిక దగ్గరకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. నిన్న అరియానా తను ఫైనలిస్ట్‌గా నాగ్ చెప్పగానే ఎలా కూర్చుండిపోయిందో అఖిల్, సొహైల్, హారిక కలిసి చేసి చూపించారు. ముగ్గురూ బాగా ఆట పట్టించారు. తరువాత బిగ్‌బాస్ అందరికీ డ్రెస్‌లు పంపించారు. ‘ముసుగు వెనుక దాగుంది ఎవరు?’ అనే టాస్క్. మాస్క్ ధరించి మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేయాలి.  మ్యూజిక్ ఆగగానే తమలోని మాస్క్‌ని తొలగించేలా చేసిందెవరో చెప్పాలి. మొదట అభి.. అరియానా, సొహైల్ తనలోని కోపాన్ని బయటకు తీశారని వారిద్దరే తన మాస్క్‌ని తొలగించేలా చేశారని చెప్పాడు. అరియానా.. తనకు వంట రాదని చెప్పానని.. అమ్మ రాజశేఖర్ కారణంగా తను వంట చేయాల్సి వచ్చిందని తెలిపింది. అవినాష్ వల్లే తన మాస్క్ మొత్తం తొలగించాల్సి వచ్చిందని చెప్పింది. సొహైల్.. తన కోపం దివి వల్ల బయటపడిందని చెప్పాడు. కుకింగ్.. అరియానా వల్ల బయటపడిందని చెప్పాడు. అఖిల్.. తన పెద్ద ఎమోషనల్ పర్సన్ కాదని.. నోయెల్ వల్ల ఫస్ట్ టైమ్ ఎమోషనల్ అయ్యానని చెపపాడు. తన కోపం అభి వల్ల వచ్చిందని చెప్పాడు. హెల్దీ ఫ్లర్టింగ్ చేస్తానని చెప్పాడు. హారిక.. కోపం తగ్గించుకోమని వాళ్ల మమ్మీ చెప్పేదని.. తన కోపాన్ని బయటకు తీసుకువచ్చింది సొహైల్ అని చెప్పింది. తనకు అంత ఓపిక ఉందని ఇక్కడే తెలిసిందని చెప్పింది. అభి వల్ల పొసెసివ్‌నెస్ బయటపడిందని చెప్పింది. ఫ్లర్టింగ్ షేడ్ అఖిల్ వల్ల బయటపడిందని చెప్పింది.

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

తరువాత ఒక పర్సన్‌ని ఎంచుకుని వారి గురించి చెప్పాలి. అరియానా.. సొహైల్ గురించి చెప్పింది. సొహైల్‌లో మొదట కోపం అనే యాంగిల్‌ను మాత్రమే చూశానని చెప్పింది. కోపం ఎంత వస్తుందో తరువాత అంతకటే ఎక్కువ బాధ పడతాడని మనసులో ఏదీ పెట్టుకోడని చెప్పింది. సొహైల్ కూడా అరియానా గురించి చెప్పాడు. తనలోని కేరింగ్‌ని ఎప్పుడూ బయటపెట్టదని సొహైల్ చెప్పాడు. అఖిల్.. అభి గురించి చెప్పాడు. అభి చాలా ఎమోషనల్ అని బయటకు రానివ్వడం లేదని చెప్పాడు. చాలా పాజిటివ్‌గానే అభి చెప్పాడు. హారిక కూడా అభి గురించి చెప్పింది. అభి ఎక్స్‌ప్రెసివ్ కాదని చెబుతాడని కానీ తను చాలా ఎక్స్‌ప్రెసివ్ అని చెప్పింది. తరువాత.. అఖిల్ గురించి ముసుగులో దాచి పెట్టేది ఏమీ లేదని హారిక చెప్పింది. తనను పూర్తి కేర్ చేయడానికి ఒక మనిషి ఉండాలని.. అది తనలోనే దాచి ఐయామ్ స్ట్రాంగ్ అన్నట్టు బిహేవ్ చేస్తాడని చెప్పింది. హారిక పొసెసివ్‌ని మించి ఏదైనా ఉంది అంటే అది నువ్వు అని అభి చెప్పాడు. హారిక ఏదైనా విషయం గురించి ఇబ్బంది పడితే అది చెప్పదని చెప్పాడు. అవతలోడే మన దగ్గరకు రావాలి కానీ తను మాత్రం వెళ్లదని చెప్పాడు.

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

తరువాత తాము మాత్రమే ఎందుకు విజేత అవడానికి అర్హుడో చెప్పాలి. అలాగే ఒక పర్సన్‌ని ఎంచుకుని హౌస్‌లో ఉండటానికి ఎందుకు అర్హులు కారో చెప్పాలి. మొదట.. అభి.. తను చాలా సార్లు నామినేట్ అయి సేవ్ అయిన వ్యక్తిని తానని కాబట్టి తాను విజేత అవడానికి డిజర్వ్ అని చెప్పాడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్లంతా డిజర్వేనని చెప్పాడు. తను హారికను ఫైనల్‌లో ఫేస్ చేయాలనుకోవట్లేదని.. తను లూజ్ అవడాన్ని భరించలేనని చెప్పాడు. మిగిలిన ముగ్గురిలో ఎవరున్నా తనకు డిఫికల్ట్ కాదని చెప్పాడు. కాబట్టి హారిక అనర్హురాలని.. చెప్పాడు. అఖిల్.. తను గేమ్ కరెక్ట్‌గా ఆడుకుంటూ వచ్చానని చెప్పాడు. కాబట్టి తను డిజర్వ్ అని చెప్పాడు. అన్ డిజర్వ్ అరియానా అని అఖిల్ చెప్పాడు. సొహైల్.. తను 100 పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చి ఆడానని చెప్పాడు. కాబట్టి తను అర్హుడినని చెప్పాడు. అరియానా.. గేమ్‌లో బియాండ్ లిమిట్ దాటుతదని కాబట్టి తను అనర్హురాలని చెప్పాడు. అలాగే అభి పేరు కూడా చెప్పాడు. తరువాత హారిక.. తన కారణంగా ఎప్పుడూ ఎవరికి ట్రబుల్ క్రియేట్ అవలేదని.. రిలేషన్స్ పరంగా కూడా మంచి రిలేషన్ ఉందని చెప్పింది. కాబట్టి తను అర్హురాలనని చెప్పింది. ఇక అరియానా అనర్హురాలని చెప్పింది. తరువాత అరియానా.. తను అనర్హురాలినని ఇందరు చెప్పడంతోనే తను గేమర్ అని తేలిందని చెప్పింది. సొహైల్‌ని బ్యాడ్ చేయాలని ఉండదని చెప్పింది. తను గేమ్‌లో 100 పర్సంట్ ఉండాలని భావిస్తానని కాబట్టి తను అర్హురాలని అరియానా చెప్పింది. అనర్హురాలిగా హారిక పేరు చెప్పింది. హారిక జడ్జిమెంట్స్ కరెక్ట్‌గా తీసుకోదని చెప్పింది.  హారిక, అరియానా కాన్వర్సేషన్.. ఫైట్ ఓవర్ అవలేదని.. ఇంకా బ్యాటిల్‌లో ఉన్నామని చెప్పుకొచ్చారు. రేపటి ప్రోమోను బట్టి చూస్తే.. గీతా మాధురి, హరితేజ, అలీ, శ్రీముఖిలు కంటెస్టెంట్‌లతో సందడి చేయనున్నారు.

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.