కొడుకు కోసం జైలుకొచ్చిన షారుఖ్.. ఆర్యన్‌కు ఓదార్పు, అరగంటపాటు అక్కడే


Send us your feedback to audioarticles@vaarta.com


డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు నిన్న ముంబై సెషన్స్ కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ఆర్యన్ ఉన్నాడు. తన కొడుకుకి బెయిల్ ఇప్పించి.. బయటకు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోన్న షారుఖ్ ఖాన్ గురువారం జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోలు, వీడియోలు బంధించేందుకు మీడియా ఎగబడింది. దాదాపు అరగంటపాటు ఆర్యన్ ఖాన్‌తో మాట్లాడిన షారుఖ్.. అతడి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఆర్యన్ అరెస్టయిన నేపథ్యంలో ఇప్పటికే షారుఖ్ తాను పాల్గొనాల్సిన షూటింగులు, ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకున్నాడు.
కాగా, అక్టోబర్ 3న ముంబయి అరేబియా సముద్ర తీరప్రాంతంలో క్రూజ్ నౌకలో డ్రగ్స్ దొరికిన కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని అతడి తరఫు న్యాయవాదులు ఇదివరకే కోర్టుకు వెల్లడించారు. నాటి నుంచి పలుమార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే వున్నాడు. బుధవారం విచారణలో భాగంగా ఎన్‌సీబీ.. కోర్టుకు పలు కీలక సాక్ష్యాలు సమర్పించింది. ప్రస్తుత పరిస్ధితుల్లో బెయిల్ ఇస్తే డ్రగ్స్ కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని ఎన్‌సీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఎన్‌సీబీ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆర్యన్ ఖాన్ సహా మరో ఇద్దరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో షారుఖ్ దంపతులు తీవ్ర నిరాశకు లోనైనట్లుగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments