Manjima Mohan: పెళ్లిలోనూ ఆ కామెంట్స్... ట్రోలర్స్‌కు గడ్డిపెట్టిన మంజిమ


Send us your feedback to audioarticles@vaarta.com


ఇటీవలి కాలంలో హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ తీవ్రమవుతున్నాయి. వయసుతో పాటు శరీరంలో మార్పులు అనివార్యమన్న సంగతి తెలిసి కూడా.. కొందరు బరితెగిస్తున్నారు. చేతిలో సోషల్ మీడియా వుందని ఇష్టమొచ్చిన రాతలు రాస్తున్నారు. తారలు ఎంత అందంగా వుందామని ప్రయత్నించినా.. బాడీ షేమింగ్‌కు గురవుతూనే వున్నారు. దీనిపై కొందరు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చినా.. నెటిజన్లలో మార్పు రావడం లేదు. దీంతో చేసేది లేక తారలు కూడా సైలెంట్ అయిపోతున్నారు. తాజాగా బాడీ షేమింగ్ కామెంట్స్ బారినపడ్డారు సినీనటి మంజిమా మోహన్.
ప్రియుడిని పెళ్లాడిన మంజిమా మోహన్:
ఇటీవల తన ప్రియుడు , సినీనటుడు గౌతమ్ కార్తీక్‌ను ఆమె వివాహం చేసుకుని మూడేళ్ల ప్రేమాయణానికి తెరదించారు. ఈ సందర్భంగా కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేస్తుంటే.. మరికొందరు మాత్రం మంజిమ బాడీ షేమింగ్‌పై అసభ్యకరంగా మాట్లాడారు. దీనిపై ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి ఇతర సంగతులను పంచుకున్నారు.
పెళ్లిలోనే లావుగా వుందంటూ కామెంట్స్:
ముఖ్యంగా బాడీ షేమింగ్‌పై మాట్లాడుతూ.. ఇలాంటివి వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. ట్రోల్స్ తనకు కొత్త కాదని, తనపై గతంలోనూ ఎన్నో ట్రోల్స్ జరిగాయని .. కానీ వాటిని తాను పట్టించుకోనని తెలిపారు. పెళ్లిలోనూ తాను లావుగా వున్నానని కొందరు కామెంట్ చేశారు.
దీనిపై తొలుత బాధపడ్డప్పటికీ.. ప్రస్తుతం తాను ఎంతో ఫిట్‌గా, సంతోషంగా వున్నానని మంజిమా మోహన్ స్పష్టం చేశారు. తాను కోరుకున్న సమయంలో బరువు తగ్గుతానని, ఎవరి కోసమో వెయిట్ తగ్గాల్సిన అవసరం లేదని ఆమె ట్రోలర్స్‌కు ఇచ్చిపడేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments