close
Choose your channels

సైరాలో బ‌న్ని...

Thursday, August 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సైరాలో బ‌న్ని...

మెగాస్టార్ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. పాలెగాడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌, న‌య‌నతార, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, కిచ్చాసుదీప్ త‌దిత‌రులతో పాటు మెగా ఫ్యామిలీ స‌భ్యులు కూడా గెస్ట్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిహారిక కొణిదెల ఇందులో చిన్న పాత్ర‌లో న‌టించ‌నుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తాడ‌ని ఇది వ‌ర‌కు వార్త‌లు వినిపించాయి.

కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీని పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.