close
Choose your channels

పారిస్ లో బన్ని స్పెషల్ సాంగ్

Saturday, January 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. రచయితగా అందరి మన్నన‌లను పొందిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. జనవరి 1న విడుదల చేసిన ఫస్ట్ ఇంపాక్ట్` ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అలాగే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బాగా శ్రమిస్తున్నారని...గతంలో చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ చెప్పారు. ఫ‌స్ట్ ఇంపాక్ట్ చూసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు బ‌న్ని మేకోవ‌ర్‌కి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే..పారిస్‌లో అల్లు అర్జున్‌పై ఒక స్పెషల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారమ్‌. ఈ పాట చిత్రీకరణ కోసం ఇప్పటికే పారిస్‌లో గల ప‌లు లొకేషన్స్‌ని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో పలు ఇంటర్నేషనల్ డాన్సర్స్‌తో ఈ పాటను చిత్రీకరించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ ద్వయం విశాల్, శేఖర్ సంగీతమందిస్తున్నారు. నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.