close
Choose your channels

చిరంజీవిని దాటిన బన్ని...

Monday, February 27, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`గా త‌న క్రేజ్ ఏంటో తెలియ‌జేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైన 55 గంట‌ల్లోనే 4.1 మిలియ‌న్ వ్యూస్‌ను సాధించింది. టీజ‌ర్ రికార్డ్స్ వ్యూవ‌ర్స్ రికార్డ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ `కాట‌మ‌రాయుడు` టీజ‌ర్ 36 గంట‌ల్లో నాలుగు మిలియ‌న్స్‌ను దాటేసింది. చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150లో నాలుగు మిలియ‌న్ వ్యూస్‌ను దాట‌డానికి 72 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఈ లెక్క‌న చూస్తే చిరంజీవి వ్యూవర్స్ రికార్డ్‌ను ప‌వ‌న్ దాటేశాడు. బ్ర‌హ్మ‌ణ యువ‌కుడుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళుతుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 19న విడుద‌ల చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.