close
Choose your channels

అక్కడ కూడా బన్ని మూడోసారి...

Sunday, July 2, 2017 • తెలుగు Comments

స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించాడు. సినిమా విడుద‌లైన వారంలో వంద‌కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సరైనోడు త‌ర్వాత బ‌న్ని వ‌రుస‌గా రెండోసారి వంద‌కోట్ల క్ల‌బ్‌లోకి చేరాడు. ముఖ్యంగా డీజే సినిమా ఓవ‌ర్‌సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్స్ క్ల‌బ్‌లోకి చేరింది.

రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్యమూర్తి సినిమాలు త‌ర్వాత బ‌న్ని మూడోసారి డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంతో మిలియ‌న్ డాల‌ర్స్ క్ల‌బ్‌లోకి జాయిన్ అయ్యాడు. దిల్‌రాజు బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఆ బ్యానర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం బ‌న్ని వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు.