close
Choose your channels

అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ సెకండ్ షెడ్యూల్‌

Wednesday, June 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ సెకండ్ షెడ్యూల్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. వీరిద్దరి కాంబినేష‌న్‌లో జులాయి, స‌న్నాఫ్ స‌త్యమూర్తి త‌ర్వాత తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యింది. సెకండ్ షెడ్యూల్‌ను నేటి నుండి (జూన్ 5)న ప్రారంభించారు. స‌మాచారం ప్ర‌కారం దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌.

ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొంటుంది. `అమేజింగ్ టీంతో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా మంచి ఎంట‌ర్‌టైన‌ర్ అవుతుంది` అంటూ పూజా హెగ్డే ట్విట్ట‌ర్ ద్వారా త‌న హ్యాపీనెస్‌ను తెలియ‌జేసింది. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేతికా శ‌ర్మ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.