నాగ్‌కి అమల ప్రేమలేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమకు వయసు లేదు. .. అవును నిజమే! అని అంటున్నారు అమల అక్కినేని. తన భర్త హీరో నాగార్జునను ఉద్దేశిస్తూ ఆమె ఓ ప్రేమలేఖను రాసి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మే 23కి నాగార్జున నటనారంగంలోనికి ఎంట్రీ ఇచ్చి 33 వసంతాలు అవుతున్నాయి. ఈ సందర్భంగా అమల ఈ లేఖను రాశారు.
"నా హీరో, నా భర్త, నా స్నేహితుడివి.. నీ కాళ్ల పై నువ్వు నిలబడ్డావు. నటుడిగాఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇప్పటికీ నా గుండె నీ కళ్లలోని మెరుపు, స్టైల్‌ను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. స్క్రీన్‌ఫై నువ్వు కనపడితే చూపు తిప్పుకోలేకపోతున్నాను. కాలం గడిచేకొద్ది నువ్వు అందంగా తయారవుతున్నావు. అన్నీ రకాల కథలతో అలరించావు.
వెంకటేశ్వరస్వామి, షిరిడిసాయి, రాముడికి నన్ను పరిచయం చేశావు. ఆ దేవుళ్లు ఇప్పుడు మన కుటుంబంలో భాగమయ్యారు. నువ్వే నా జీవితంలో మ్యాజిక్. ఓటమి ఎదురవుతుందని ఎప్పుడూ భయపడలేదు. మంచి కంటెంట్ ఉన్న కథలను మాకు ఇస్తుంటావు. నిర్మాతగా కూడా ఎప్పుడూ ఓడిపోలేదు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తుంటావు. 33 ఏళ్ల కెరీర్‌లో 65 సినిమాలు చేశావు. మై స్వీట్ హార్ట్ అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగేశ్వరరావులాగా, ఈ చిత్ర పరిశ్రమలో నువ్వు మరెన్నో ఏళ్లు రాణించాలని కోరుకుంటున్నాను" అన్నారు అమల అక్కినేని.
2 Reasons for me to celebrate on May 23 rd- Modiji leads India again, and the second @iamnagarjuna #33yearsofnagarjuna pic.twitter.com/vTukkzjxc5
— Amala Akkineni (@amalaakkineni1) May 25, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments