close
Choose your channels

'ఆర్ఆర్ఆర్‌' లో అమితాబ్‌, మ‌హేశ్‌..?

Monday, February 3, 2020 • తెలుగు Comments

ఆర్ఆర్ఆర్‌ లో అమితాబ్‌, మ‌హేశ్‌..?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఎన్టీఆర్ జ‌త‌గా బ్రిట‌న్ భామ‌ ఒలివియా మోరిస్ న‌టిస్తుంటే.. రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో ఈ ప్రెస్టీజియ‌స్ సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఆ వార్త ప్ర‌కారం.. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కూడా భాగం కాబోతున్నార‌ట‌. అయితే వారు తెర‌పై క‌న‌ప‌డ‌ర‌ట‌. విన‌ప‌డ‌తార‌ట‌. అంటే హిందీలో అమితాబ్‌.. తెలుగులో మ‌హేశ్ ఈ సినిమాకు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం.

తార‌క్ తెలంగాణ విప్ల‌వ వీరుడు కొమురం భీమ్‌గా.. రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సముద్ర‌ఖ‌నితో పాటు బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అజ‌య్ స‌ర‌స‌న శ్రియా శ‌ర‌న్ న‌టిస్తుంది. హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడ్ త‌ద‌త‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ద‌స‌రాకు ‘ఆర్ఆర్ఆర్‌’ను విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz