close
Choose your channels

ఆమని ప్రధానపాత్రలో అమ్మదీవెన ప్రారంభం

Tuesday, August 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆమని ప్రధానపాత్రలో అమ్మదీవెన ప్రారంభం

ఆమని కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘అమ్మ దీవెన’. పద్మ సమర్పిస్తున్నారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, దినేష్, శరత్ చంద్ర కీలక పాత్రలు చేయగా ఈ సినిమాకు ఎత్తరి గురవయ్య నిర్మాత. పద్మజ నాయుడు, ఎత్తరి చినమారయ్య ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. శివ ఏటూరి దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. బి.గోపాల్ ఫస్ట్ షార్ట్ డైరక్షన్ చేశారు.

ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు మాట్లాడుతూ “ కథ విన్నాక అంగీకరించిన ఆమనిగారికి ధన్యవాదాలు. దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. నాకు ఈ అవకాశం కల్పించిన మా నిర్మాతలకు ధన్యవాదాలు పిల్లలు నైతిక విలువలు తెలుసుకుంటారని అభిప్రాయము ”అని అన్నారు.

ఆమని మాట్లాడుతూ “ ఇదొక మంచి సినిమా. ఫ్యామిలీలో అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఎలా ఉంటుందనే విషయాన్ని చూపించే సినిమా. పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి తల్లి ఎంత కష్టపడుతుందనే విషయాన్ని ఇందులో చక్కగా చూపిస్తున్నారు. నిర్మాతలు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు ఇలాంటి కథను తీయడానికి. దర్శకనిర్మాతలు నన్ను కలిసి కథ చెబుతామని అన్నప్పుడు ఆలోచించాను. కానీ కథ విన్నాక ఏమీ మాట్లాడలేదు. చేస్తాననే అన్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ కేరక్టర్‌” అని అన్నారు. ఇక పద్మగారి గురించి చెప్పాలంటే ఆమె డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని చెప్పలేము ఈ చిత్రానికి అన్ని తానై చేశారు. ఈ చిత్రం ఆల్‌మోస్ట్ టీమ్ వర్క్ అని చెప్పాలి అన్నారు. లమ్మమ్మగారి రియల్ స్టోరీ ఆమె నిజ జీవితంలో ఎలా ఇబ్బందులు పడ్డారు. పిల్లలను ఎలా పెంచారు. ఎంత బాధ్యతగా పెంచారు అన్న కథాంశంతో ఉన్న చిత్రం అని అన్నారు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ “ ఒక మాతృమూర్తి, ఒక త్యాగశీలి కథ ఇది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న బంధాలను చక్కగా ఆవిష్కరించే సినిమా. ఇందులో నేను నెగటివ్ రోల్ చేస్తున్నాను” ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన కథ కాబట్టి మీరదందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

ఎస్వీహెచ్ మాట్లాడుతూ “ మా నిర్మాతల అమ్మకథ ఇది. చాలా బావుంటుంది” అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: యస్.వి.హెచ్, డ్యాన్స్: గణేశ్ స్వామి, ఆర్ట్: పి.వి.రాజు, కథ: ఎత్తరి బ్రదర్స్. మాటలు: శ్రీను.బి., సురేశ్ కుమార్.యం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.