close
Choose your channels

కంటెస్టెంట్లను ఒక ఆట ఆడుకున్న సుమ.. ఎలిమినేట్ అయిన అమ్మ

Monday, November 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కంటెస్టెంట్లను ఒక ఆట ఆడుకున్న సుమ.. ఎలిమినేట్ అయిన అమ్మ

‘నా పేరు చిన్నా’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్లందరికీ దీపావళి గిఫ్ట్స్ తీసుకొచ్చానని అయితే అవి దక్కించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ చేయాలని చెప్పారు. అభి డ్యాన్స్ చెయ్యడానికి సిద్ధంగా ఉండు అని నాగ్ సరదాగా అనగానే.. ఇక బయటకు వెళితే నాకు కెరీర్ ఉండదని అభి చెప్పాడు. ఇక సీన్ గార్డెన్ ఏరియాకు మారింది. ఫస్ట్ సొహైల్‌కి గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ తనకు రావాలంటే ఒకరిని నామినేట్ చేయాలని.. ఆ కంటెస్టెంట్ ఇచ్చిన టాస్క్‌ను ఇన్ టైమ్‌లో చేస్తే ఆ గిఫ్ట్ వస్తుందని నాగ్ చెప్పారు. మెహబూబ్‌కి ఇచ్చిన టాస్క్.. ఫేస్ మజిల్స్ వాడి మూడు బిస్కట్లు తినాలి. మెహబూబ్ ఇన్ టైమ్‌లో చేశాడు. సొహైల్‌కి బ్రేస్‌లెట్‌ని మెహబూబ్ గిఫ్ట్‌గా పంపించాడు. అఖిల్‌కి గిఫ్ట్ కోసం హెడ్ బాస్కెట్ బాల్ ఆడాలి. అభి దానిని చేశాడు. అఖిల్‌కి మోనాల్ చాక్లెట్లను గిఫ్ట్‌గా పంపించింది. నెక్ట్స్ అభి కోసం బైనాక్యులర్స్ వేసుకుని కలర్ బాల్స్‌ని సెపరేట్ చేయాలి కానీ అఖిల్ చేయలేకపోవడంతో గిఫ్ట్‌ని సెండర్‌కు రిటర్న్ చేశాడు. నెక్ట్స్ లాస్యకు గిఫ్ట్ కోసం టిష్యూ బాస్క్‌ని నడుముకు కట్టుకుని దానిలో ఉన్న 20 బాల్స్‌ని బయటకు పంపించాలి కానీ దీనిని హారిక చేయలేకపోయింది. గిఫ్ట్‌ను తిరిగి ఇచ్చేశారు. ఇక మెహబూబ్ కోసం ఇద్దరికి విగ్స్ పెట్టి జడలు వేయాలి. మోనాల్ ఇన్ టైమ్‌లో వేయడంతో మెహబూబ్‌కి గిఫ్ట్ వచ్చింది. అవినాష్‌కి గిఫ్ట్ కోసం రెండు బెలూన్స్‌ని పూర్తి ఊది పగలగొట్టాలి. దీనిని అమ్మ రాజశేఖర్ చేయలేకపోయారు. గిఫ్ట్ రిటర్న్ చేశాడు. అరియానా గిఫ్ట్ కోసం నడుముకు టెయిల్ పెట్టుకుని 5 బాల్స్‌ని గోల్ చేయాలి. మెహబూబ్ చేయలేకపోయాడు. ఇక హారిక గిఫ్ట్స్ అభి, లాస్య వాళ్లకిచ్చిన టాస్క్‌ని కంప్లీట్ చేశారు. దీంతో హారికకు గిఫ్ట్ వచ్చింది. అమ్మ రాజశేఖర్, మోనాల్‌కు ఎవరూ గిఫ్ట్ కావాలని అడగకపోవడంతో నాగ్.. అమ్మకు చేపల కూర, మోనాల్‌కు స్వీట్స్ పంపించారు.

నెక్ట్స్ అభిని సేఫ్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ యాంకర్ సుమను నాగ్ పిలిచారు. ఇక సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరినీ ఇమిటేట్ చేసి అదరగొట్టింది. ఏం చేస్తారు సర్.. మీరు, మీ కోడలు యాంకరింగ్ చేస్తుంటే లోపలకు వెళ్లక నాకు తప్పట్లేదంటూ సెటైర్ వేసింది. లోపలుండే వాళ్లు చాలా సేఫ్‌గా ఉన్నారని చెప్పింది. తరువాత కంటెస్టెంట్ల ముందుకు వెళ్లగానే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌లో మారుతున్నాయంటూ కామెడీ చేసింది. మెహబూబ్ నవ్వడం లేదని సుమ చెప్పింది. అయితే నేను షాక్‌లో ఉన్నానని మెహబూబ్ చెప్పడంతో నువ్వు షాక్‌లో లేవు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నావంటూ స్పాంటీనియస్‌గా చెప్పింది. ఇక అవినాష్.. నాగ్‌లు తన చిన్నప్పటి నుంచి అంటే తన చిన్నప్పటి నుంచి యాంకరింగ్ చేస్తూ పెరిగానని చెప్పి ఫుల్లుగా నవ్వించేశారు. ఇక అరియానాను సుమ ఇమిటేట్ చేసింది. అచ్చం అరియానా ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడింది. ఇక కొన్ని ఐటెమ్స్ తీసుకొచ్చి హౌస్‌మేట్స్ గురించి చెప్పింది. మొదట టిష్యూస్ తీసింది. ఈ సీజన్‌లో ఎక్కువగా అమ్మడవుతోందని చెప్పడంతో వెంటనే నర్మద కోసమా అని నాగ్ అడిగారు. ఇక మోనాల్‌ను కూడా సుమ ఇమిటేట్‌ చేసింది. లాలీపాప్‌ను అరియానా కోసం తీసుకొచ్చానని చెప్పింది. ఇక అరటి తొక్క విషయాన్ని తీసి ఫన్ చేసింది. ఇక లాస్య కోసం తెలుగు జోక్స్ బుక్‌ని తీసుకొచ్చింది. ఇక లాస్యను సుమ ఒక ఆటాడుకుంది. అభి కోసం డంబుల్స్ తీసుకొచ్చింది. ఫిజికల్ టాస్క్ ఒకటి చేయించింది. హారికకు ఎవ్వరిని భయపెడుతున్నావంటూ సుమ సెటైర్ వేసింది. హారికతో ఒక టంగ్ ట్విస్టర్ చేయించింది. ఇక అవినాష్‌కి ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్ ఇచ్చింది. మెహబూబ్, సొహైల్‌కి ఇద్దరి పేర్లున్న జంట షూలను తీసుకొచ్చింది. సొహైల్ నేను ఆడ అంటాడని నువ్వు మగ అని నాకు తెలుసంటూ కామెడీ చేసింది. అవినాష్ కోసం బిస్కెట్స్ తీసుకొచ్చింది. అరియానాకు బిస్కెట్స్ వేస్తుంటాడని చెప్పింది. అవినాష్‌ని కూడా ఒక ఆట ఆడుకుంది. అమ్మ కోసం ప్లాస్టర్ బాక్స్‌ని తీసుకొచ్చింది. అఖిల్‌తో పాట పాడించింది. అద్భుతంగా పాడాడని కితాబిచ్చింది. నీకోసం ఎవరైనా ఇలా పాడారా? అని నాగ్ అడిగితే.. పాడారు సర్.. ఆ తరువాతే నేను రెండు జోల పాటలు పాడాల్సి వచ్చిందని సెటైర్ వేసింది. ఇక సుమకు సినిమాటిక్‌గా సెండాఫ్ చెప్పారు.

ఫ్రూట్స్ ఉన్న కార్డ్స్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చి వాటిలో సేమ్ ఫ్రూట్స్ వచ్చిన వాళ్లు సేఫ్ అవుతారు. మోనాల్‌ సేఫ్ అయ్యింది. ఇక మిగిలిన ఇద్దరు అవినాష్, అమ్మ రాజశేఖర్‌లను సెల్ఫీ తీసుకుని బయట లాన్‌లో ఏర్పాటు చేసిన బాక్సుల్లోకి రమ్మని నాగ్ చెప్పారు. ఇక నేను వచ్చేంత వరకూ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని అరియానా బాగా ఎమోషనల్ అయింది. అయితే బాక్సులో ఉన్న ఇద్దరూ బాక్సుల్లో కనిపించలేదు. దీంతో డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే అవినాష్‌ని మాత్రం పంపించారు. అవినాష్ బాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కెరియర్ ఏమవుతుందోనని ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందని చెప్పాడు. తరువాత అమ్మ రాజశేఖర్‌ను నాగ్ స్టేజ్ పైకి పిలిచారు. తరువాత అమ్మ రాజశేఖర్ జర్నీ చూపించారు. అసలు ఎవరు? నకిలీ ఎవరు? అని అమ్మను నాగ్ అడిగారు. అసలు.. సొహైల్, అరియానాలకు ఇచ్చారు. సొహైల్‌కి కోపం ఉండాలని చెప్పారు. అరియానా చాలా బోల్డ్ అని.. గేమ్ అంటే చాలా బాగా ఆడుతుందని చెప్పారు. లాస్యకు కూడా అసలు అని ఇచ్చారు. ఇక నకిలీలో మొదట అఖిల్‌ ఫోటో పెట్టాడు. తన కుటుంబం అంటే తనకు చాలా ప్రేమ అన్నారు. నకిలీలో అభి ఫోటో కూడా పెట్టారు. మోనాల్‌ను అసలులో పెట్టారు. అంతా గేమ్స్ ఆడుతున్నారని ఎవరినీ నమ్మవద్దని చెప్పారు. మెహబూబ్‌ని కూడా అసలులో పెట్టారు. తను విలన్ కాదు హీరో అని చెప్పారు. అవినాష్ అసలు అని.. రియల్ జోకర్ అని.. కొంచెం క్యారెక్టరైజేషన్ ఉందని.. దానిని చేంజ్ చేసుకోవాలన్నారు. ఇక హారికను నకిలీలో పెట్టారు. తన కెప్టెన్సీని అమ్మ.. మెహబూబ్‌కి ఇచ్చారు. ఇక ఎవరికైతే గిఫ్ట్స్ రాలేదో వాటిని స్టోర్ రూమ్‌లో పెట్టి తెచ్చుకోమన్నారు. లాస్యకు ఆమె కొడుకు ఫోటో వచ్చింది. లాస్యకు అఖిల్ ఆ ఫోటోను పంపించాడు. అవినాష్‌కి టీ షర్ట్ వచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.