close
Choose your channels

రెగ్యులర్ షూటింగ్ లో అనగనగా ఓ రాజకుమారుడు

Sunday, January 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నవీన్ బాబు, సంజన, అమృత హీరో హీరోయిన్లు గా శ్రీమతి రమాదేవి సమర్పణలో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకం పై షాలిని ఫేమ్ షెరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అనగనగా ఓ రాజకుమారుడు. పివి రాఘవులు నిర్మాత. కమెడియన్ సుమన్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా గోవా లో మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది.

ఈ సందర్బంగా దర్శకుడు షెరాజ్ వివరాలు తెలియచేస్తూ .. లవ్ , కామెడీ , అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తీ చేసాం. సరికొత్త పాయింట్ తో తెరకెక్కే ఈ సినిమాలో కథకు సరిపోయేలా హీరో హీరోయిన్స్ బాగా సెట్ అయ్యారు. ప్రేమనేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. అక్కడ తెరకెక్కించిన సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తి కలిగిస్తాయి. కామెడీ తో పాటు థ్రిల్లర్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రెండో షెడ్యూల్ ని త్వరలోనే హైద్రాబాద్ లో మొదలు పెట్టనున్నాం. ఈ షెడ్యూల్ లోనే పాటలు మిగతా సన్నివేశాలు పూర్తీ చేస్తాం. ఈ సినిమా విషయంలో మా నిర్మాత ఇచ్చిన ప్రోత్సహంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నాం అన్నారు.

ఈచిత్రానికి కెమెరా & ఎడిటింగ్ : ఏకరీ లక్కీ , కథ - 100 డేస్ మూవీస్, పాటలు : బాషా శ్రీ, సమర్పణ : రమాదేవి, నిర్మాత : పివి రాఘవులు, సంగీతం - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : షెరాజ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.