close
Choose your channels

దసరా కానుకగా 'అనగనగా ఒక చిత్రమ్

Thursday, September 24, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రేమకథా చిత్రవ్‌ు` దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్, గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై శివ, మేఘశ్రీ జంటగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక చిత్రమ్`. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఇదే నెలలో పలు చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ముందుగా చేసుకున్న ఒప్పందాల కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అనగనగా ఓ చిత్రవ్‌ు`ను దసరా కానుకగా అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కొడాలి సుబ్బారావు వివరాలు తెలియజేస్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల పలు చిత్రాల విడుదల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఈ కారణంగా ముందుగా చేసుకున్న ఒప్పందాల కారణంగా మిగిలిన చిత్రాలకు చోటిచ్చి సహకరించడానికిగాను మా సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. కుటుంబం అంతా కలిసి చూసే ఫ్యామిటీ ఎంటర్‌టౌనర్‌గా తెరకెక్కింది. ప్రేమకథా చిత్రవ్‌ు` తర్వాత జె. ప్రభాకర్‌రెడ్డి గారి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా అందరినీ అలరించే చిత్రం అవుతుంది`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.