close
Choose your channels

మ‌హేశ్ ‘స‌ర్కారు వారి పాట‌’లో మ‌రో హీరోయిన్‌..?

Friday, June 26, 2020 • తెలుగు Comments

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేసి సినిమాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప‌లు ర‌కాలైన పేర్లు విన‌పడ్డాయి. అయితే చివరకు జాతీయ అవార్డు గ్రహీత కీర్తిసురేశ్‌ను ఫైన‌ల్ చేశారు. ఈ విష‌యాన్ని కీర్తిసురేశ్ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా న‌టించే అవ‌కాశం ఉంద‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా నివేదా థామ‌స్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

‘స‌ర్కారు వారి పాట‌’ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంద‌ని ఇటీవ‌ల‌ మ‌హేశ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల‌ను మోసం చేసిన విల‌న్ నుండి తిరిగి డ‌బ్బులు రాబ‌ట్టే క‌థే ఈ సినిమా అని వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz