close
Choose your channels

నయనతార ఖాతాలో మరో హిట్

Saturday, December 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌య‌న‌తార ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది ఈ మ‌ధ్య‌. ముఖ్యంగా త‌మిళ చిత్ర సీమ‌లో ఈమె న‌టించిన సినిమాలు బాగానే వ‌ర్క‌వుట్ అవుతున్నాయి. దీంతో కోలీవుడ్‌లో లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది న‌య‌న్‌. ఇటీవ‌లే `అర‌మ్` అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకున్న న‌య‌న‌తార‌.. తాజాగా మ‌రో చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఆ చిత్ర‌మే `వేలైక్కార‌న్‌`. `ధృవ` ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ `త‌ని ఒరువ‌న్‌`కి ద‌ర్శ‌కుడు అయిన జ‌యం రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

`రెమో` ఫేమ్ శివ కార్తీకేయ‌న్ హీరోగా న‌టించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా.. వ‌సూళ్ల ప‌రంగానూ మెప్పిస్తోంది. దీంతో మ‌రో విజ‌యం న‌య‌న‌తార ఖాతాలో చేరిన‌ట్లయ్యింది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార రెండు తెలుగు చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వాటిలో ముందుగా `జై సింహా` తెర‌పైకి రానుంది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టిస్తున్న `సైరా న‌ర‌సింహా రెడ్డి` ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. 2019 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న్ ల‌క్కీ ఛార్మ్ త‌మిళంతో పాటు తెలుగులోనూ కొన‌సాగుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.