close
Choose your channels

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వాటిపై విచారణ..

Saturday, February 10, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వాటిపై విచారణ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తేల్చేందుకు జ్యూడీషియల్, విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. టీఎస్‌ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలలో అవినీతి జరిగిందని.. వీటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. తెలంగాణను అబద్ధాల పునాదుల మీద గత ప్రభుత్వం నడిపిందని మండిపడ్డారు. కేవలం ఇరిగేషన్‌కే రూ.16వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని తెలిపారు. ఇది గత సర్కార్ చేసిన పాపం అని దుయ్యబట్టారు. కమీషన్ల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపారని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు ఆశించారని... కానీ అలా జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయంలో సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని.. ఇప్పటి వరకూ 15 కోట్ల మంది మహిళ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఇందుకు ఆర్టీసీ కార్మికుల కృషే కారణమని.. వారిని అభినందిస్తున్నానని తెలిపారు.

అలాగే గత ప్రభుత్వం రూ.2.97లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని.. కానీ తాము వాస్తవ లెక్కలతో గతేడాది కంటే రూ.15వేల కోట్లు తక్కువతో బడ్జెట్‌ ప్రవేశపెట్టామని చెప్పారు. మేడిగడ్డకు వెళ్దామని మాజీ సీఎం కేసీఆర్‌తో సహా శాసన సభ్యులందరినీ ఆహ్వానించామని చెప్పారు. ఈనెల 13న బీఆర్ఎస్ వాళ్లకి సమావేశం ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒకరోజు ముందు అయినా వెనకా అయినా వెళ్లడానికి రెడీ అని రేవంత్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.