close
Choose your channels

శంక‌ర్‌ని పొగిడిన ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

Sunday, August 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శంక‌ర్‌ని పొగిడిన ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన రోబో సీక్వెల్ 2.0 విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా గురించి రెహ‌మాన్ మాట్లాడుతూ ``శంక‌ర్ క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాడు. నేను ఓ సాంగ్‌ను త్రీడీలో చూశాను... మైండ్ బ్లోయింగ్‌. ఐర‌న్ మేన్ త‌ర‌హాలో సినిమాను తెర‌కెక్కించాడు శంక‌ర్‌.

క్లైమాక్స్ ఇన్ క్రెడిబుల్‌. ఓ ఇండియ‌న్ డైరెక్ట‌ర్ ఇలా కూడా ఆలోచిస్తాడా? అనిపించింది. శంక‌ర్ లాంటి డైరెక్ట‌ర్ ఉండ‌టం మ‌న అదృష్టం`` అన్నారు రెహ‌మాన్‌. 2.0 ఈ ఏడాది న‌వంబ‌ర్ 29న విడుద‌ల కాబోతుంది. 400 కోట్లకై పైగా భారీ బ‌డ్జెట్‌తో సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించింది. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.