close
Choose your channels

Bigg Boss Telugu 7 : శెభాష్ అర్జున్ .. వైల్ట్‌కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి , గ్రాండ్ ఫినాలే‌కి ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచి

Saturday, December 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫినాలే అస్త్ర కోసం పోటీ జరుగుతోంది. ఈ రేసు ప్రారంభమైన నాటి నుంచి మిగిలిన వారితో పోలిస్తే ఎవరైతే తక్కువ పాయింట్లు సాధించుకుంటున్నారో వారు రేసు నుంచి తప్పుకోవాలి. కానీ వారు వెళ్తూ వెళ్తూ.. వారు సాధించిన పాయింట్స్‌ను వేరే కంటెస్టెంట్స్‌కి ఇవ్వాల్సి వుంటుంది. తొలుత శివాజీ , శోభాశెట్టిలు తమ పాయింట్స్‌ని అమర్‌దీప్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ప్రియాంక గౌతమ్‌కి, ప్రిన్స్ యావర్ .. పల్లవి ప్రశాంత్‌లకు తాము సాధించిన పాయింట్స్ ఇచ్చారు.

ఫినాలే అస్త్ర 10వ గేమ్‌లో భాగంగా ‘‘కలర్ బాల్స్’’ అనే టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం బంతులను ఒకే లైన్‌లో సెట్ చేయాలి. ఇందులో అర్జున్ గెలవగా.. ప్రశాంత్, అమర్‌లు తర్వాతి స్థానంలో నిలిచారు. అనంతరం 11 గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా అర్జున్, ప్రశాంత్, అమర్‌దీప్‌లకు కలిపి ఒకే బెల్ట్ వేసి వుంటుంది. వీరు ఆ బెల్ట్‌తో పాటు మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్‌ను లాగుతూ వెళ్లి కింద పడిన జెండాలను తీసి బుట్టలో వేయాలి. వెంటనే అర్జున్ వారిద్దరిని లాక్కెళ్లిపోతూ పది జెండాలను తన బుట్టలో వేసుకున్నాడు. ఇందులోనూ అర్జున్ గెలవగా.. అమర్‌దీప్, ప్రశాంత్ తర్వాతి స్థానంలో నిలిచారు. అయితే అందరికంటే తక్కువ పాయింట్లు వుండటంతో రైతుబిడ్డ ఫినాలే అస్త్ర నుంచి తప్పుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.

చివరికి అర్జున్, అమర్‌దీప్‌లు మాత్రమే ఫినాలే అస్త్రలో నిలవగా వారిద్దరికి ‘‘పాముతో చెలగాటం’’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా రెండు బొమ్మలు ఏర్పాటు చేయగా.. అక్కడున్న పరికరం సాయంతో బాల్‌ను పైకి తీసికెళ్లి పాము నోటిలో వేయాలి. ఎవరైతే మూడు బాల్స్ కరెక్ట్‌గా పడేలా చేస్తారో వారే విజేత. అమర్, అర్జున్ చాలా జాగ్రత్తగా ఈ గేమ్ ఆడారు. కానీ అర్జున్ ఎక్కువ బాల్స్‌ను పాము నోటిలో వేసి విజయం సాధించి ఫినాలే అస్త్ర గెలుచుకున్నాడు. అంతేకాదు.. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో తొలి ఫైనలిస్టుగా నిలిచాడు.

నిజానికి అర్జున్ అంబటి బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. SPY, SPA బ్యాచ్‌లకు దూరంగా తన ఆట తాను ఆడేవాడు. అందుకే అర్జున్ ఆటతీరు చాలా మందికి నచ్చింది. ఎవ్వరితోనూ ఫ్రెండ్‌షిప్ లేకపోవడం కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినా .. ఆటపైనే ఫోకస్ పెట్టాడు. ఫినాలే అస్త్రా కోసం జరిగిన టాస్క్‌ల్లో ఓడిపోయిన కంటెస్టెంట్స్ తమ పాయింట్స్‌ను అమర్‌దీప్‌, పల్లవి ప్రశాంత్‌లకే ఇచ్చారు. కానీ అర్జున్ సాధించిన స్కోర్ మొత్తం తాను ఆడి గెలుచుకున్నదే. గౌతమ్ తప్పుకునేటప్పుడు కూడా అతని పాయింట్స్‌ తనకే వస్తాయని అర్జున్ భావించాడు. కానీ అమర్‌ హింస తట్టుకోలేక ప్రియాంక .. గౌతమ్‌ని ఒప్పించి అతని పాయింట్స్‌ని అమర్‌కి ఇచ్చేలా చేసింది. దీంతో అర్జున్‌లో మరింత కసి పెరిగి , ఎవ్వరూ పాయింట్స్ ఇవ్వకపోయినా గెలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ పట్టుదల మొత్తం ఇవాళ ఆటలో కనిపించి తనే ఫినాలే అస్త్రను గెలుచుకోవడంతో పాటు ఈ సీజన్‌లో తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.