close
Choose your channels

33 స్టూడియోల్లో బాహుబలి 2..!

Monday, January 30, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న బాహుబ‌లి 2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. అయితే...ఈ చిత్రానికి సంబంధించిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ ఎక్కువుగా ఉండ‌డం వ‌ల‌న అనుకున్న విధంగా ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా..? అనేది కొంత మంది సందేహం.
ఇలాంటి సందేహాల‌కు బాహుబ‌లి 2 విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌ర్ క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ ఫుల్ స్టాఫ్ పెట్టారు. ఇండియాలోని విఎఫ్ ఎక్స్ స్టూడియోల్లో గ‌త 15 నెలలుగా వ‌ర్క్ జరుగుతుంది. వ‌ర‌ల్డ్ వైడ్ 33 కంటే ఎక్కువ స్టూడియోల్లో బాహుబ‌లి 2 వ‌ర్క్ జ‌రుగుతుంది అని క‌మ‌ల్ క‌ణ్ణ‌న్ తెలియ‌చేసారు. సో...ఎనౌన్స్ చేసిన విధంగా బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఖాయం అనుకోవ‌చ్చు..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.