close
Choose your channels

పాట‌తో షురూ చేయ‌నున్న బాల‌య్య‌

Wednesday, March 18, 2020 • తెలుగు Comments

పాట‌తో షురూ చేయ‌నున్న బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. యాక్ష‌న్ ఎపిసోడ్‌తో పాటు కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. రీసెంట్‌గా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అయితే సెకండ్ షెడ్యూల్‌ను వెంట‌నే స్టార్ట్ చేయాల్సింది కానీ చేయ‌లేదు. అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు..క‌రోనా వైర‌స్‌. ఈ నెల 23న ప్రారంభం కావాల్సిన సెకండ్ షెడ్యూల్ వాయిదా ప‌డింది.

సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు వ‌చ్చే నెల మొద‌టి వారం నుండి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను ఫైట్‌తో ప్రారంభించిన బోయపాటి, బాల‌య్య‌.. సెకండ్ షెడ్యూల్‌ను పాట‌తో ప్రారంభించ‌బోతున్నార‌ట‌. నారి నారి న‌డుమ మురారి త‌ర‌హా స్టైల్లో హీరో, ఇద్ద‌రు నాయిక‌ల మ‌ధ్య ఈ పాట ఉంటుంద‌ట‌. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో అంజ‌లి, శ్రియ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నార‌ని టాక్‌. బాల‌య్య కూడా రెండు పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. అందులో ఒకటి అఘోరా పాత్ర అని స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz