close
Choose your channels

'బంగార్రాజు' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సందర్బంగా స్పెషల్ మాష్ అప్ సాంగ్ ను ఎక్స్క్లూసివ్ గా టెలికాస్ట్ చేస్తున్న జీ తెలుగు

Wednesday, March 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్తదనం అంటే జీ తెలుగు. ఎప్పుడు కూడా ప్రేక్షకులని అలరించాలనే తాపత్రయంతో సాధన చేస్తూనే ఉంటుంది. అందుకే వినోదం పంచడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి ఒక వినోదానికి స్వాగతిస్తూ, 2022 మొదటి బ్లాక్ బస్టర్ సినిమా 'బంగార్రాజు' ను ఈ ఆదివారం, మార్చ్ 27 సాయంత్రం 5.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనుంది. ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి అభిమానులని కొత్త రకంగా పలకరిస్తున్న మన ఛానల్, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం కూడా ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేసింది. తెలుగు టెలివిజన్ లో కని విని చూడని విధంగా ఇది ఉండబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఒక స్పెషల్ మాష్ అప్ సాంగ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ థియేటర్ మరియు ఓ టి టి ప్లాట్ ఫాం లలో కూడా చూడని కంటెంట్. ఎక్సక్లూసివ్ గా టివి అభిమానులకి మాత్రేమే. ఇవన్నీ ఎప్పుడు ఎలా మీ ముందుకు వస్తాయో తెలియాలంటే జీ తెలుగు ఛానల్ ని వీక్షించండి.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు కావలిసినన్ని రుచులు పొదిగి ఉన్నాయి. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా లో రమ్య కృష్ణన్, కృతి శెట్టి నటించారు. జీ తెలుగు ఛానల్ ఎప్పుడు కూడా ప్రజల గుండెలలో మరియు వారి మధ్యలో ఉండాలని అనుకుంటుంది. అందుకే ‘భీమవరం లో బంగార్రాజులతో బులెట్ ర్యాలీ’ అని అక్కినేని ఫాన్స్ కు ఒక అరుదైన అవకాశం కల్పించింది. బంగార్రాజు కాస్ట్యూమ్ వేసుకొని, బుల్లెట్ బైక్ నడపాలి. అలా అని చెప్పగానే, ఎంతో 70 + బైకర్స్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు టెలివిజన్ లోనే సరికొత్త రికార్డును సృష్టించారు. మార్చి 20 తేదీన జరిగిన ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.

సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచి ‘బంగార్రాజు’ కథ స్టార్ట్‌ అవుతుంది. చిన్నబంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు నాగలక్ష్మి(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్‌ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి, సర్పంచ్‌ నాగలక్ష్మిని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజును హత్య చేయడానికి కొంతమంది ప్లాన్‌ చేస్తారు. ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? అనేదే కథ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.