close
Choose your channels

భారీ మ‌ల్టీస్టారర్ ప్లానింగ్‌

Tuesday, December 18, 2018 • తెలుగు Comments

భారీ మ‌ల్టీస్టారర్ ప్లానింగ్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్స్ హ‌వా కొన‌సాగుతుంది. హీరోలంద‌రూ మ‌ల్టీస్టారర్స్‌పై ఆస‌క్తిని చూపుతుండ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా ప‌ని ఈజీ అవుతుంది. మంచి మంచి క‌థ‌లు తెర‌ పై వ‌స్తున్నాయి.

లెటెస్ట్‌గా మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్‌కి ప్లానింగ్ జ‌రుగుతోంది. వివ‌రాల్లోకెళ్తే.. తెలుగు, త‌మిళంలో ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను తెర‌కెక్కించేలా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి ఆలోచ‌న‌లు చేస్తుంద‌ట‌.

టాలీవుడ్ నుండి నేచుర‌ల్ స్టార్ నాని, కోలీవుడ్ నుండి మాస్ హీరో విశాల్ ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించే అవ‌కాశాలు  క‌న‌ప‌డుతున్నాయ‌ట‌. పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ ఈ సినిమాను తెరకెక్కిస్తాడ‌నేది న్యూస్‌.

మ‌హి వి.రాఘ‌వ్ ప్ర‌స్తుతం యాత్ర సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ ప‌ని పూర్తి కాగానే మ‌ల్టీస్టార‌ర్‌పై వ‌ర్క్ చేస్తాడ‌నేది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. అయితే దీనిపై నిర్మాణ సంస్థ‌, ద‌ర్శ‌కుడు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Get Breaking News Alerts From IndiaGlitz