close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: నువ్వు మగాడివేనా.. సన్నీని అంత మాటన్న ప్రియా, ‘‘గుడ్డు’’ పోరులో విన్నరెవరో..?

Wednesday, October 20, 2021 • తెలుగు Comments

ఎప్పటిలాగానే బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల రచ్చ మళ్లీ మొదలైంది. మానస్‌ తనని దూరం పెడుతున్నాడని, పట్టించుకోవడం లేదంటూ ఆనీ మాస్టర్‌ ముందు వాపోయింది ప్రియాంక. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె కోసం వచ్చాడు మానస్‌. ఇక కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా లోబో ఆడితే మస్త్‌ మజా వచ్చేదని గుర్తు చేసుకున్నారు సన్నీ, రవి. అయితే ఎన్నడూ లేని విధంగా కెప్టెన్సీ టాస్క్‌లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ గేమ్ ఆడటం అలరించింది. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: నువ్వు మగాడివేనా.. సన్నీని అంత మాటన్న ప్రియా, ‘‘గుడ్డు’’ పోరులో విన్నరెవరో..?

48వ రోజు ‘‘ బంగారు కోడిపెట్ట సాంగ్’’ తో ఎపిసోడ్ ప్రారంభమైంది. మానస్‌కి తన మనసు అర్థంకాలేదని ప్రియాంక సింగ్ కంటతడి పెట్టింది. ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలన్న వాళ్లతో బాగానే ఉంటున్న మానస్ తనని మాత్రం దూరం పెడుతున్నాడని వాపోయింది. దీంతో ఆమె కోసం వచ్చాడు మానస్. ఆమెని బ్రతిమాలాడు. నామినేషన్స్ సందర్భంగా సన్నీ తన నామినేషన్‌ని తీసుకోలేదని మానస్ వద్ద తన బాధని వ్యక్తం చేసింది. అందుకు మానస్‌ పింకీని ఓదార్చే ప్రయత్నం చేశాడు. చివరికి అన్నం తినిపిస్తానని చెప్పి స్వయంగా భోజనం తీసుకొచ్చి ఆమెకి గోరుముద్దలు తినిపించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: నువ్వు మగాడివేనా.. సన్నీని అంత మాటన్న ప్రియా, ‘‘గుడ్డు’’ పోరులో విన్నరెవరో..?

మానస్ తనకు అన్నం తినిపించడంతో ప్రియాంక సింగ్ కూల్ అయింది. అయితే అంతకు ముందు తాను ఇతర అమ్మాయిలకు తినిపించిన దాని గురించి తవ్వింది ప్రియాంక. అవన్నీ చూస్తున్నావా? అంటూ ప్రశ్నించాడు మానస్‌. హౌస్‌లో ఇన్ని కెమెరాలున్నాయి, అందులో నేను కూడా ఓ కెమెరానే అని, ఓ కన్ను ఎప్పుడూ నిన్నేచూస్తుందని ప్రియాంక బదులిచ్చింది. మరోవైపు నామినేషన్‌కి సంబంధించి యాంకర్‌ రవి, కాజల్‌ ల మధ్య డిస్కషన్ నడిచింది. సన్నీ తప్పు చేసి ఒప్పుకోవడం లేదని రవి కామెంట్ చేయడంతో కాజల్ రివర్సైంది. సన్నీ తప్పు చేశాక కూడా ఎందుకు సపోర్ట్ చేశావని ప్రియ మానస్ తో చెప్పింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: నువ్వు మగాడివేనా.. సన్నీని అంత మాటన్న ప్రియా, ‘‘గుడ్డు’’ పోరులో విన్నరెవరో..?

అనంతరం బిగ్‌బాస్‌ బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ప్రభావతి అనే కోడి.. కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు కోడిగుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఏ ఇంటిసభ్యుడు ఎక్కువ గుడ్లను అందుకుని వాటిపై తమ ముఖం ఉన్న స్టిక్కర్స్‌ పెడతారో వారే కెప్టెన్సీకి పోటీపడతారు. ఈ గేమ్‌ ఎవరికి వాళ్లు సొంతంగా ఆడాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు. కానీ అందుకు విరుద్ఢంగా ఇంటి సభ్యులు జంటలుగా ఆడారు. తొలిసారిగా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ తలపడ్డారు. సన్నీ, మానస్‌, కాజల్‌ ఒక జట్టుగా... ప్రియా, మానస్‌ ఒక జాయింట్‌గా.. యానీ మాస్టర్‌, శ్రీరామ్‌ జాయింట్‌గా.. జెస్సీ, షణ్ముఖ్‌ ఒక జంటగా వుండగా.. విశ్వ, రవి, సిరి సింగిల్‌గానే గేమ్ ఆడారు. మొదటి కోడి కూత రాగానే ఎగ్స్ కోసం ఇంటి సభ్యులు పోటీపడ్డారు. తాను అందరి గుడ్లు జోలికి వస్తానని ప్రియ...పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసి ముందే వార్నింగ్ ఇచ్చింది. ఈ లోగా బయటి నుంచి గుడ్లు ఎగిరిపడడంతో హౌస్‌మేట్స్ అంతా వాటి కోసం పోటీపడ్డారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: నువ్వు మగాడివేనా.. సన్నీని అంత మాటన్న ప్రియా, ‘‘గుడ్డు’’ పోరులో విన్నరెవరో..?

ఇప్పటికే ఉప్పు- నిప్పులా వున్న ప్రియా, సన్నీల మధ్య మరోసారి వివాదం రగులుకుంది. సన్నీని మగాడివైతే గేమ్‌ ఆడాలని, ధైర్యంగా ఆడాలని, దొంగతనం చేయడం కాదంటూ ప్రియ రెచ్చగొట్టింది. అలాగే సన్నీ బుట్టలోని గుడ్లను టైం చూసి నొక్కేసింది. దీనికి సీరియస్ అయిన సన్నీ తన జోలికొస్తే మామూలుగా వుండదని వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హీటు పెంచాయి. మరోవైపు సిరి స్టిక్కర్ల కోసం తన బెడ్ చెక్ చేసిందని షణ్ముక్-జెస్సీ అనడంతో సిరి ఫీలైంది.

ప్రియ-ప్రియాంక ఇద్దరూ కాజల్ తీరు బాగాలేదని మాట్లాడుకున్నారు. చివర్లో మానస్‌ సైతం ఎమోషన్‌ అవ్వడం సస్పెన్స్ గా మారింది. అతన్ని సన్నీ ఓదార్చాడు. హౌజ్‌ నుంచి బయటకు వెళ్లాక కూడా మంచి జీవితాంతం మంచి స్నేహితులుగానే ఉందామన్నాడు సన్నీ. చివర్లో సన్నీ, కాజల్‌ బుట్టల్లోని ఎగ్స్‌ని సిరి, శ్రీరామ్‌ కాజేశారు. దీనితో ఫస్ట్‌ రౌండ్‌ ముగియగా అత్యధికంగా మానస్‌ దగ్గర 32 గుడ్లు వుండగా.. సన్నీ వద్ద 23 ఉన్నాయి. అయితే పింకీ అతడికి తన గుడ్లన్నీ ఇచ్చేసిందని, పైగా మానస్‌ ప్రియ దగ్గర కూడా తీసుకున్నాడని విమర్శించింది యానీ. రేపటి ఎపిసోడ్‌లో సన్నీ- ప్రియాల మధ్య వ్యవహారం కొట్టుకునే వరకు వెళ్లినట్లుగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz