close
Choose your channels

BiggBoss: వందేళ్లు బతికేస్తానన్న ఆదిరెడ్డి.. రోహిత్‌ను మొసలితో పోల్చిన బిగ్‌బాస్

Wednesday, December 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వందేళ్లు బతికేస్తానన్న ఆదిరెడ్డి.. రోహిత్‌ను మొసలితో పోల్చిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ తెలుగు 6 చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో విజేత ఎవరో తేలిపోనుంది. చివరి వారం కావడంతో కంటెస్టెంట్స్‌కి హౌస్‌లో వారి జర్నీని చూపిస్తున్నాడు బిగ్‌బాస్. నిన్న రేవంత్, శ్రీసత్యలకు సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్.. వారికి గ్రాండ్ ఫినాలేకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈరోజు ఆదిరెడ్డి, రోహిత్‌లను గార్డెన్‌లోకి పిలిచి వారి జర్నీ చూపించాడు.

తొలుత ఆదిరెడ్డిని గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు బిగ్‌బాస్. సీజన్ మొదలైన నాటి నుంచి హౌస్‌లో సాగిన అతని జర్నీకి సంబంధించిన మధుర క్షణాలకు సంబంధించి ఫోటోలు, వీడియోలను బిగ్‌బాస్ అక్కడ అమర్చాడు. వాటిని చూసి గాల్లో తేలిపోయాడు బిగ్‌బాస్. అదే సమయంలో భార్య కవిత నుంచి ఫోన్ రావడంతో ఆమె మాట్లాడాడు. నీ కల నెరవేర్చుకోవడానికి ఒక్క అడుగు దూరంలో వున్నావ్.. కామన్‌మెన్ ఏదైనా సాధించగలడని నిరూపించాలని ఆమె ఆకాంక్షించింది. అలాగే నీ కోసం మన కుటుంబం, మన అభిమానులు ఎదురుచూస్తున్నారని ... ఆల్ ‌ది బెస్ట్ ఆది అని చెప్పింది. దీనికి ఆయన కూడా లవ్యూ కవిత అని చెప్పాడు. ఇది తన జీవితంలో బెస్ట్ ఎమోషనల్ మూవ్‌మెంట్ అని ఎమోషనల్ అయ్యాడు.

అనంతరం బిగ్‌బాస్ మాట్లాడుతూ... సామాన్యుడిగా బిగ్‌బాస్ రివ్యూవర్‌గా... ఇప్పుడు కంటెస్టెంట్‌గా మీ జర్నీ చివరి అంకానికి చేరుకుందని చెప్పాడు. మీ స్నేహం మొదటి నుంచే వ్యూహంగా మారిందని... ప్రతి విషయాన్ని నిశితంగా కొత్త కోణంలో చూడగలుగుతున్నారని ఇదే మిమ్మల్ని ఒక అడుగు ముందు వుంచిందని బిగ్‌బాస్ ప్రశంసించాడు. మాట పడని స్వభావం, మాట ఎలా అనాలో మీకు తెలుసునని చెప్పాడ. విజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో వున్న మీకు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు బిగ్‌బాస్. దీనికి ఆదిరెడ్డి మాట్లాడుతూ.. తనకు అండగా నిలిచిన ప్రజలు ఎప్పుడూ తన గుండెల్లో వుంటారని అన్నాడు. ఫైమా, రాజు, బాలాదిత్య, గీతూలను ఆదిరెడ్డి గుర్తుచేసుకున్నాడు. ఈ వంద రోజుల జర్నీలో ఏదైనా తప్పు చేసి వుంటే క్షమించాలని ప్రజలను కోరారు. రిజల్ట్ మీ చేతుల్లోనే వుందని... ఏ స్థానం ఇచ్చినా సంతోషంగా తీసుకుంటానిన ఆదిరెడ్డి అన్నాడు. బిగ్‌బాసే నా లైఫ్.. బిగ్‌బాస్ లేనిదే నేను లేను, తన కుటుంబం కూడా కష్టాల్లోనే వుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తర్వాత రోహిత్‌ను గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు బిగ్‌బాస్. స్వతహాగా చాలా స్ట్రాంగ్‌గా వుండే రోహిత్ తన ఫోటోలు, భార్య చెప్పిన మాటలను చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ అతనికి మొసలి కథని చెప్పాడు. మొసలి బలం నీటిలోనే వుంటుందని.. అదే నేలపై మాత్రం ఒక్క అడుగు వేయాలన్నా ఆలోచిస్తుందని, కంఫర్ట్ జోన్ వదిలి వచ్చి ఏదైనా సాధించాలంటే ఎంతో ధైర్యం కావాలని అన్నాడు. స్నేహితులు జట్టుగా ఆడితే తప్పు కానప్పుడు భార్యాభర్తలు కలిసి ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యింది..? అసలు భార్యాభర్తలకు మించిన స్నేహితులు వుంటారా అని బిగ్‌బాస్ ప్రశ్నించాడు. ఎవరు ఏమనుకున్నా ... మీరిద్దరూ లెక్కచేయలేదు.. సహనాన్ని కోల్పోలేదని ప్రశంసించాడు. ఆ మాటలకు రోహిత్ మరింత ఎమోషనల్ అయ్యాడు.

నిజానికి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో టాప్ 6 వున్న కంటెస్టెంట్స్‌లో అరుదైన వ్యక్తిత్వం రోహిత్‌ది. ఎవరు నీతి తప్పినా, దిగజారినా తాను మాత్రం తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. తనను తన భార్యను అంతా కలిసి టార్గెట్ చేసినా.. నమ్మించి మోసం చేసినా రోహిత్ ఏ మాత్రం చలించకపోగా, కష్టం వచ్చిన వారికి అండగా నిలబడ్డాడు. ఈ రెండు రోజుల్లో చూపిన కంటెస్టెంట్స్ జర్నీలలో రోహిత్‌ది ప్రజలను ఆకట్టుకునేలా వుంది.

ఇదిలావుండగా... గత వారం ఇనయా ఎలిమినేషన్ కాగా, ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు సభ్యులు వున్నారు. వీరిలో ఒకరిని మిడ్ వీక్‌లో ఎలిమినేట్ చేస్తామని నాగ్ తెలిపారు. మరి వీరిలో హౌస్‌ను వీడేది ఎవరో. కీర్తి, శ్రీసత్యలకు తక్కువ ఓటింగ్ వున్నందున వీరిలో ఒకరు ఎలిమినేట్ కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సీజన్ బిగ్‌బాస్ అంచనాలకు అందడం లేదు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.