close
Choose your channels

అనుకున్న టైమ్‌కే బిగ్‌బాస్ షో ప్రారంభం.. కంటెస్టెంట్స్ వీరే

Monday, July 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుకున్న టైమ్‌కే బిగ్‌బాస్ షో ప్రారంభం.. కంటెస్టెంట్స్ వీరే

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ ఆదివారం రాత్రి 9:00 గంటలకు ప్రారంభమైంది. ముందుగా అనుకున్నట్లుగానే నిర్వాహకులు షోను ప్రారంభించేశారు. ఈ షోపై వివాదాలు, పోలీస్ స్టేషన్లలో, కోర్టుల్లో కేసులు నడుస్తుండటం షో ప్రారంభం కష్టమేమో అని అందరూ భావించారు. అంతేకాదండోయ్.. ఆఖరి నిమిషం వరకు ఎవరొచ్చి షోను అడ్డుకుంటారో..? ఏ రూపంలో అడ్డంకులు ఎదురవుతాయో అని నిర్వాహకులకు ఒకటే టెన్షన్.. టెన్షన్.! అయితే భారీ భద్రత నడుమ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటివ్వకుండా షో మాత్రం షురూ అయ్యింది.

మొదట అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చి షో గురించి మూడు ముక్కలు చెప్పి.. అనంతరం ముగ్గురు కంటెస్టెంట్లను పరిచయం చేశారు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్లను హౌస్‌మేట్స్‌, బిగ్ బాస్ ప్రియులకు నాగ్ పరిచయం చేశారు. కాగా ఈ కంటెస్టెంట్లలో చాలా వరకు అందరికీ తెలిసిన వాళ్లే.. అంతేకాదు.. ఇది వరకు అటు నెట్టింట్లో.. ఇటు మీడియాలో హల్ చల్ చేసిన జాబితాలోని వారే దాదాపుగా ఉన్నారు.

హౌస్‌లోకి అడుగుపెట్టింది వీళ్లే..!

01.. శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి
02.. రవికృష్ణ (సీరియల్ ఆర్టిస్ట్)
03.. ఆశు రెడ్డి (డబ్ స్మాష్ ఆర్టిస్ట్)
04.. జాఫర్ బాబు (టీవీ9 రిపోర్టర్/యాంకర్)
05.. హిమజ (టీవీ నటి)
06.. రాహుల్ సిప్లిగంజ్ (తెలంగాణ పాప్ సింగర్)
07..రోహిణి (టీవీ/జబర్దస్త్ నటి)
08.. బాబా భాస్కర్ (కొరియోగ్రాఫర్)
09.. పునర్నవి భూపాలం (నటి)
10.. హేమ (సీనియర్ నటి కమ్ కమెడియన్)
11.. అలీ రజా (సీరియల్ ఆర్టిస్ట్)
12.. మహేశ్ ( ఫన్‌బకెట్ ఫేమ్/కామెడీ ఆర్టిస్ట్)
13.. శ్రీముఖి (బుల్లితెర యాంకర్)
14.. వరుణ్ సందేశ్ (నటుడు)
15.. వితికా షేరు (వరుణ్ సందేశ్ సతీమణి)

15మందితో ప్రారంభమైన ఈ షో వంద రోజులపాటు జరగనుంది. అయితే మొదటి వారం నుంచే ఎలిమినేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో..? ఎవరు చివరికి మిగిలి విన్నర్‌ అవుతారో తెలియాలంటే షోను ఫాలో అవ్వాల్సిందే.. వంద రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.