close
Choose your channels

Bigg Boss Telugu 7 : ఫ్రెండ్‌కి షాకిచ్చిన ప్రియాంక, ప్రశాంత్ - అమర్‌ మధ్య మాటల యుద్ధం.. ఈ వారం నామినేషన్స్‌లో వీరే

Tuesday, December 5, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ అయిన గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. మరికొద్ది వారాల్లో సీజన్ ముగియనుంది. ఈ సీజన్‌లో చివరి నామినేషన్స్ సోమవారం జరిగాయి. ఈ వారం ఎలిమినేషన్ ముగిసిన తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ అంతా గ్రాండ్ ఫినాలేకు చేరుకుంటారు. చివరికి వచ్చినా కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతూనే వున్నాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి టైల్‌పై తాము నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ ఫోటోను ప్రింట్‌ చేసి.. దానిని పగులగొట్టాల్సి వుంటుంది.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే..
ప్రిన్స్ యావర్ .. శోభాశెట్టి, ప్రియాంకా జైన్
శోభాశెట్టి.. ప్రిన్స్ యావర్, శివాజీ
పల్లవి ప్రశాంత్ .. అమర్‌దీప్, శోభాశెట్టి
అర్జున్ అంబటి .. అమర్‌దీప్, ప్రిన్స్ యావర్
ప్రియాంకా జైన్ .. అమర్‌దీప్, ప్రిన్స్ యావర్
శివాజీ .. ప్రియాంక, అమర్‌దీప్
అమర్‌దీప్.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్

ఈ నామినేషన్స్‌లో హైలెట్‌గా నిలిచింది ప్రియాంక నామినేషన్స్. ఈ సీజన్‌లో తొలి నుంచి సీరియల్ బ్యాచ్‌గా ముద్రపడ్డ అమర్‌దీప్ , శోభాశెట్టి, ప్రియాంకలు ఓ గ్రూప్‌గా ఆడుతూ వచ్చారు. టాస్క్‌ల్లో ఒకొరికొకరు సాయం చేసుకుంటూ ఇక్కడిదాకా వచ్చారు. అయితే గత వారం టికెట్ టు ఫినాలే టాస్క్ సందర్భంగా సీరియల్ బ్యాచ్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఓ గేమ్‌ సందర్భంగా ప్రియాంకపై ఫిజికల్‌గా అటాక్ చేశాడు అమర్‌దీప్. అయినప్పటికీ ఆమె ధీటుగా పోరాడింది. చివరికి ఓడిపోయింది. అయితే రూల్ ప్రకారం ఓడిపోయినవాళ్లు తమ పాయింట్స్‌ని మరో కంటెస్టెంట్‌కి ఇవ్వొచ్చు. దీంతో ప్రియాంక తనను కెప్టెన్‌ని చేశాడనే కృతజ్ఞతతో గౌతమ్‌కు పాయింట్లు ఇచ్చేసింది. ఇది అమర్ జీర్ణించుకోలేకపోయాడు.. తనను ఏదో ఒకటి అంటూనే మాటలతో హింసించాడు.

ఇప్పుడు నామినేషన్స్ సందర్భంగా ఈ కారణంతోనే అమర్‌దీప్‌ను నామినేట్ చేసింది. దీనికి స్పందించిన అమర్ .. ఫ్రెండ్ నుంచి సపోర్ట్ కోరుకోవడం తప్పుకాదన్నాడు. కానీ తాను ఓడిపోయిన బాధలో వుంటే పదే పదే పాయింట్ల గురించి అనడం తనకు నచ్చలేదని ప్రియాంక వెల్లడించింది. ఇక చేసేదేం లేక అమర్‌దీప్ సైలెంట్ అయ్యాడు. తర్వాత అమర్‌దీప్, ప్రశాంత్ మధ్య గొడవ జరిగింది. గత కొన్ని వారాలుగా బాగానే వున్న వీరిద్దరూ చివరి నామినేషన్స్‌లో రెచ్చిపోయారు. నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అంటూ కొట్టుకోబోయారు. అమర్‌కు సపోర్ట్ చేసి తప్పు చేశానని.. ‘‘ఆడోడి’’ మాటలు మాట్లాడకు అంటూ ప్రశాంత్ సహనం కోల్పోయాడు. దీనికి అమర్‌దీప్ కూడా రెచ్చిపోయాడు. నేను ఆడోడిని అంటూ గాజులు తీసుకురండి వేసుకుంటానని మాట్లాడాడు. శివాజీ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మొత్తం మీద ఈ వారం అర్జున్ తప్పించి .. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, శోభాశెట్టి, ప్రియాంకలు నామినేషన్స్‌లో వున్నారు.

నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ గురించి వివరించారు బిగ్‌బాస్. ఈ ఫినాలే రేసు మిమ్మల్ని ఫైనల్‌కు తీసుకెళ్తుంది లేదంటే ఫినిష్ లైన్ చేరకుండానే ఆపేస్తుందని చెప్పాడు. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా రెండు వారాల పాటు మీ ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయని , ఎక్కువ ఓట్లు పొందినవారు బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలుస్తాడని పేర్కొన్నాడు. తక్కువ ఓట్లు పొందిన వారు ఫినాలే వీక్‌కు చేరుకోవడానికి ముందే ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ హెచ్చరిస్తాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.