close
Choose your channels

క‌మ‌ల్‌కు చేదు అనుభవం

Thursday, May 16, 2019 • తెలుగు Comments

క‌మ‌ల్‌కు చేదు అనుభవం

'మ‌క్క‌ల్ నీది మ‌య్యం' అధినేత క‌మ‌ల్‌హాస‌న్‌కు, ఎన్నిక‌ల ప్ర‌చారంలో చేదు అనుభ‌వం ఎదురైంది.  మ‌దురై అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తిరుప్ప‌రాన్ కుంద్ర‌మ్ ఎన్నిక‌ల ర్యాలీలో కొంద‌రు క‌మ‌ల్ పైకి చెప్పులు విసిరారు.

అయితే చెప్పులు ఆయ‌న‌కు త‌గ‌ల‌లేదు. ఇటీవ‌ల హిందూ ఉగ్ర‌వాదంపై క‌మ‌ల్ హాస‌న్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. దీని పై క‌మ‌ల్ అభిమానులు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

11 మంది పై క‌మ‌ల్ కార్య‌క‌ర్త‌లు పిర్యాదు చేశారు. వీరిలో భాజపా నేత‌లు, హ‌నుమాన్ సేన నేతలు ఉన్నారు. పోలీసులు ఒక‌రిని అదుపులోకి తీసుకున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz