close
Choose your channels

బజ్: హీరో రామ్ జాక్ పాట్ కొట్టబోతున్నాడా ?

Wednesday, June 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బజ్: హీరో రామ్ జాక్ పాట్ కొట్టబోతున్నాడా ?

నటన, డాన్స్, ఎనెర్జీ ఇలా అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు రామ్ పోతినేని. కానీ రామ్ ఎప్పుడూ స్టార్ అనిపించుకోవడానికి ఒక అడుగు దూరంలోనే నిలిచిపోతున్నాడు. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ కు కావాల్సిన ఊపు తెచ్చిపెట్టింది. రామ్ ఇక స్టార్ గా ఇంకా గొప్పస్థాయికి చేరుతాడా లేదా అనేది అతడి ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. రామ్ కెరీర్ ని మలుపు తిప్పే అవకాశాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. ప్రస్తుతం రామ్ తమిళ క్రేజీ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైంది.

ఇదీ చదవండి: అల్లు అర్జున్ నన్ను నమ్మి మళ్ళీ వచ్చాడు..

తాజాగా రామ్ మరో జాక్ పాట్ లాంటి ఆఫర్ దక్కించుకోబోతున్నట్లు టాక్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ హీరో రామ్ ని డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోలకు ఎన్నో బ్లాక్స్ బస్టర్స్ అందించిన మురుగదాస్ డైరెక్షన్ లో నటించే అవకాశం వస్తే రామ్ కు అంతకు మించి ఇంకేం కావాలి.

ప్రస్తుతం మురుగదాస్, రామ్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై ఓ క్లారిటీ రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.