close
Choose your channels

బజ్: RRR కోసం ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ?

Thursday, July 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బజ్: RRR కోసం ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ?

ఆర్ఆర్ఆర్ చిత్రం అనుకున్న టైం కంటే బాగా ఆలస్యం అయింది. సాధారణంగా రాజమౌళి చిత్రాలు భారీస్థాయిలో ఉంటాయి కాబట్టి మేకింగ్ కు టైం పడుతుంది. దానికి తోడు కరోనా ప్రభావం ప్రపంచంపై పడడంతో షూటింగ్ బాగా ఆలస్యం అయింది.

కానీ రాజమౌళి తన టీం ని ఉపయోగించుకుని ఆర్ఆర్ఆర్ షూట్ ని ఫైనల్ స్టేజీపై తీసుకువచ్చాడు. సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండడంతో జక్కన్న ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టాడు. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రాజమౌళి ఓ క్రేజీ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బజ్: RRR కోసం ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ?

ఈ సాంగ్ పై ఆసక్తి పెరిగేలా ఓ న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్రమోషనల్ సాంగ్ లో ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు రాజమౌళి హీరోలందరూ భాగం కాబోతున్నట్లు టాక్. ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ఇలా జక్కన్న చిత్రాల్లో నటించిన హీరోలంతా ఈ సాంగ్ లో మెరవబోతున్నారట. కేవలం ప్రమోషనల్ సాంగ్ కోసమే హైదరాబాద్ లో ఓ స్టూడియో లో ప్రత్యేక సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఇండియా వ్యాప్తంగా ప్రచారం కల్పించేలా ఈ సాంగ్ ని కీరవాణి కంపోజ్ చేస్తున్నారట. యంగ్ మ్యుజీషియన్ అనిరుధ్ ఈ సాంగ్ కు గాత్రం అందించబోతున్నట్లు టాక్. ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

బజ్: RRR కోసం ప్రభాస్, రవితేజ, నితిన్, నాని, సునీల్ ?

రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.