close
Choose your channels

మల్టీస్టారర్ లో చాందిని చౌదరి...

Monday, March 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో భవ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై నారా రోహిత్‌, ఆది, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్ హీరోలుగా `శ‌మంత‌క మ‌ణి` అనే మ‌ల్టీస్టార‌ర్ లాంచ్ అయిన సంగ‌తి తెలిసే ఉంటుంది. న‌లుగురు యంగ్ హీరోస్ ఒక సినిమాలో చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమాలో చాందిని చౌద‌రి ఓ హీరోయిన్‌గా న‌టించ‌బోతుంది.

వెబ్ సీరియ‌ల్స్‌తో మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు కేటుగాడు, కుంద‌న‌పు బొమ్మ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు చాందినికి మంచి బ్రేక్‌ను ఇవ్వ‌లేక‌పోయాయి. ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో ఆది స‌ర‌స‌న చాందిని న‌టిస్తుంది. మ‌రి ఈ సినిమా అయినా చాందిని బ్రేక్ ఇస్తుందేమో చూడాలి..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.