close
Choose your channels

ఆ సినిమాలు చూస్తే నిద్రపట్టడం లేదన్న చంద్రబాబు..

Saturday, March 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా రోహిత్ - ఇషా త‌ల్వార్ - నంద‌మూరి తార‌క‌ర‌త్న క‌ల‌సి న‌టించిన చిత్రం రాజా చెయ్యి వేస్తే. ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా జ‌రిగింది.
ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ...కొన్ని సినిమాలు చూస్తుంటే అస‌లు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ఎందుకు అలాంటి సినిమాలు తీస్తారో తెలియ‌డం లేదు. అయితే క్రైమ్ చేసే క్రిమిన‌ల్స్ కొన్ని సినిమాలు చూసి ఇన్ స్పైయిర్ అవుతున్నారు. ఈ విష‌యం ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల ద్వారా తెలిసింది. అందుచేత సినిమాలు తీసే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సామాజిక బాధ్య‌త‌తో సినిమాలు తీయాలన్నారు. అంతా బాగానే ఉంది కానీ..బాబు గార్కి నిద్రప‌ట్ట‌కుండా చేసిన ఆ సినిమాలు ఏమిట‌నేది మాత్రం బ‌య‌ట పెట్ట‌లేదు. కానీ...ఆ సినిమాలు బాల‌య్య సినిమాలు మాత్రం కావ‌ని క‌న్ ఫ‌ర్మ్ చేసారు బాబు గారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.