close
Choose your channels

మెగాస్టార్ 150వ సినిమా డైలాగ్స్ లీక్..

Thursday, June 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈమ‌ధ్య స్టార్ హీరోల‌ సినిమాలు షూటింగ్ లో ఉండ‌గానే...ఆ సినిమాకు సంబంధించిన పాట‌లో...లేక‌పోతే కొన్ని సీన్సో...డైలాగులో లీక‌వ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. బాహుబ‌లి సినిమాలో వార్ సీన్ అలాగే లీక‌య్యింది. అత్తారింటికి దారేది చిత్రం అయితే ఏకంగా 45 నిమిషాల వీడియో ఫుటేజ్ లీక‌వ్వ‌డం ఎంత సెన్సేష‌న్ అయ్యిందే తెలిసిందే. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.... ఇప్పుడు అటు అభిమానులు ఇటు ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మెగాస్టార్ 150వ చిత్రం. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్ చంచ‌ల్ గూడ జైలులో షూటింగ్ జ‌రుపుకుంటుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే...చిరు 150వ సినిమాలో డైలాగ్స్ అంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇంత‌కీ ఆ డైలాగ్స్ ఏమిటంటే...

దుక్కి దున్నడమే తెలుసు వీళ్ళకు- దుర్మార్గం చెయ్యడం తెలియదు. నాగలి పట్టడమే తెలుసు వీళ్ళకు – నరకడం తెలియదు.

వీళ్ళ పొలాలకు నీరు ఇవ్వకపోతే.. ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కలను నరుకుతూ మీ గుండెలను దున్నుకుపోతారు.

ఈ డైలాగ్స్ చిరు 150వ సినిమాలో డైలాగ్స్ అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. నిజ‌మో కాదో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.