close
Choose your channels

నిహారిక వివాహానికి బాలయ్యను ఆహ్వానించిన చిరు..!

Monday, December 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిహారిక వివాహానికి బాలయ్యను ఆహ్వానించిన చిరు..!

ఈనెల 9న మెగా డాటర్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లో అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహం కోసం దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్‌పూర్ ప్యాలెస్ సిద్ధమవుతోంది. కోవిడ్ కారణంగా ఈ వివాహానికి ముఖ్యమైన అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. నాగబాబు స్వయంగా వెళ్లి ఆయనను ఆహ్వానించారని.. మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంగా ఫోన్ చేసి నిహారిక వివాహానికి ఆహ్వానించినట్టు టాక్ నడుస్తోంది.

అయితే బాలయ్యతో పాటు ఇండస్ట్రీ తరుఫున అగ్ర తారాగణాన్ని ఈ వివాహానికి చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆహ్వానం మేరకు యంగ్ హీరోలు ఫ్యామిలీతో హాజరు కానున్నారని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్లు సైతం ఈ వివాహానికి హాజరు కానున్నారని సమాచారం. ఈ పెళ్లికి పవర్ స్టార్ వపన్ కల్యాణ్ రెండు రోజుల ముందే ఉదయ్ పూర్ చేరుకోనున్నారని తెలుస్తోంది. మెగా హీరోలంతా ఈ వివాహ వేడుకలో సందడి చేయనున్నారు.

నిహారిక వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా చాలా అందంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ వెడ్డింగ్ కార్డు చాలా కాస్ట్లీగానే కనిపిస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి తక్కువ కార్డులు ప్రింట్ చేయించినా రిచ్ లుక్ ఉండేలా చూసుకున్నారని ఆ కార్డును బట్టి తెలుస్తోంది. కాగా.. 9వ తారీఖున రాజస్థాన్‌లో వివాహానంతరం 11 వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కోసం కూడా మెగా ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లనూ చేస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.