close
Choose your channels

దిల్ రాజు నిజంగానే దిల్ ఉన్న నిర్మాత - చిరంజీవి..!

Saturday, January 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ‌ర్వానంద్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్రం శ‌త‌మానం భ‌వ‌తి. ఈ చిత్రాన్ని వేగేశ్నస‌తీష్ తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మించారు. సంక్రాంతి కానుక‌గా రిలీజైన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో స‌క్సస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌త‌మానం భ‌వ‌తి స‌క్సస్ మీట్ ను హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ వినాయ‌క్ ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ‌లో నిర్మించిన తొలి చిత్రం దిల్ ద‌ర్శ‌కుడు వినాయ‌క్ కు చిరంజీవి స‌న్మానించారు.

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ...నిర్మాత అంటే క్యాషియ‌ర్ లా మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దిల్ రాజు అన్నీ తానై మంచి చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా మంచి చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. దిల్ రాజు నిజంగానే దిల్ ఉన్న నిర్మాత‌. శ‌త‌మానం భ‌వ‌తి అని మంచి కుటుంబ క‌థా చిత్రాన్ని నిర్మించినందుకు దిల్ రాజును అభినందిస్తున్నాడు. అలాగే శ‌ర్వానంద్ ఫ‌స్ట్ నాతోనే ఓ యాడ్ లో న‌టించాడు. ఈరోజు శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంతో శ‌ర్వానంద్ విజ‌యం సాధించ‌డం నా బిడ్డ స‌క్సస్ సాధించిన‌ట్టుగా భావిస్తున్నాను.

డైరెక్ట‌ర్ స‌తీష్, శిరీష్,ల‌క్ష్మ‌ణ్....ఇలా టీమ్ అంద‌ర్నీ మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను.దిల్ రాజుకు దిల్ సినిమా నిర్మాణ స‌మ‌యంలో సినిమా గురించి అన్నీ నేర్పిన వినాయ‌క్ ను గుర్తుపెట్టుకుని స‌న్మానించ‌డం బాగుంది. ప్ర‌కాష్ రాజ్ నాకు ఆప్తుడు. ప్ర‌కాష్ రాజ్ ఉన్న టైమ్ లో మ‌నం ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డాలి అంత గొప్ప న‌టుడు. ఇక జ‌య‌సుధ స‌హ‌జ‌న‌టి. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించినా సినిమాల్లో కూడా న‌టిస్తున్నారు. నేను రాజ‌కీయాల్లో ఉన్నా సినిమా చేయ‌డానికి బ‌హుశా జ‌య‌సుధ గారు కూడా స్పూర్తి క‌లిగించారు అనుకోవ‌చ్చు అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.