close
Choose your channels

చిరు చిన్న‌ల్లుడు ఖాతాలో మ‌రో చిత్రం?

Friday, June 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు చిన్న‌ల్లుడు ఖాతాలో మ‌రో చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజేత పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మించ‌గా.. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో రావు ర‌మేష్ ఒక కీల‌క పాత్ర పోషించారు. జూలై 6న ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. తొలి సినిమా విడుద‌ల కాక‌ముందే మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట క‌ళ్యాణ్‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. వ‌ర‌ప్ర‌సాద్ గారి అల్లుడు అనే పేరుతో రూపొందిన ఓ స్క్రిప్ట్.. క‌ళ్యాణ్ చెంత‌కు చేరింద‌ట‌. క‌థ‌తో పాటు టైటిల్ కూడా న‌చ్చ‌డంతో ఈ సినిమాకి ప‌చ్చ జెండా ఊపేశార‌ట క‌ళ్యాణ్‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. చిరంజీవి అస‌లు పేరు శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్ కావ‌డం.. అందులో వ‌ర ప్ర‌సాద్‌తోనే ఆయ‌న అల్లుడు క‌ళ్యాణ్‌.. వ‌ర‌ప్ర‌సాద్ గారి అల్లుడు చేయ‌నుండడం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.