close
Choose your channels

నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్ ద్వారా 'చుట్టాలబ్బాయి'

Monday, August 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్‌ ద్వారా రాకేష్‌ ఈ చిత్రాన్ని 125 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా...
నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ - ''చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా 'చుట్టాలబ్బాయి' చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన భాగ్యశ్రీ ఫిలింస్‌ రాకేష్‌గారు మంచి ఫ్యాన్సీ ఆఫర్‌ ఇచ్చి నైజాం రిలీజ్‌ హక్కులను తీసుకున్నారు. నైజాంలో 125 థియేటర్లలో ఈ చిత్రాన్ని భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అలాగే అన్ని ఏరియాల్లో చాలా మంచి థియేటర్లలో మా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కుటుంబ సమేతంగా అందరూ చూసి ఎంజాయ్‌ చేసే విధంగా డైరెక్టర్‌ వీరభద్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆది పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రం రూపొందింది. ఆది, వీరభద్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి మా బేనర్స్‌కి కూడా చాలా మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.