close
Choose your channels

Adipurush : ట్రైలర్ బాగుంది అనుకునేలోపే.. మరో వివాదంలో ఆదిపురుష్‌, సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు

Friday, May 12, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏ ముహూర్తంలో ప్రారంభమైందో కానీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘‘ఆదిపురుష్’’ను ఆది నుంచి కాంట్రవర్సీలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్‌లు చూసి హాలీవుడ్ రేంజ్‌లో ఊహించుకున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. వీటి దెబ్బకు ఆదిపురుష్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు.. ఆదిపురుష్ నుంచి ఏదో ఒక అప్‌డేట్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ గుస్సా అయ్యారు. తీరా టీజర్ బయటకు వచ్చిందో లేదో అందరి అంచనాలు ఆవిరైపోయాయి. ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్‌కు రానంత స్థాయిలో వ్యతిరేకత, ట్రోలింగ్ ఆదిపురుష్ విషయంలో జరిగింది. చివరికి పార్టీలు, ప్రభుత్వాలు, కోర్టులు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది.

ఆదిపురుష్‌ టీజర్‌పై కోర్టుల్లో వ్యాజ్యాలు:

ఈ చిత్రంలోని రాముడి పాత్రతో పాటు రావణుడు, హనుమంతుడి గెటప్‌లను రామాయణంలో చెప్పినట్లు కాకుండా ఇష్టానుసారంగా తెరకెక్కించడంతో నెటిజన్లు, హిందూ సంఘాలు మండిపడ్డారు. మరీ ముఖ్యంగా రావణుడి పాత్రను ముస్లిం చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీలా తీర్చిదిద్దారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు రిలీజ్‌ డేట్‌ను కూడా వాయిదా వేశారు. దీంతో మేకర్స్‌కు నిద్ర మత్తు వదిలింది. ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైన భాగాలకు రీషూట్, రీ ఎడిట్ చేయించారు ఓంరౌత్. ఆ తర్వాత కొత్త పోస్టర్స్ వదులుతూ సినిమాపై హైప్‌ను పెంచారు.

సెన్సార్ బోర్డుకు సనాతన ప్రచారకర్తలు ఫిర్యాదు:

ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో టీజర్ తాలూకు గతాన్ని జనాలు మరిచిపోయారు. అన్ని క్యారెక్టర్లు, గెటప్‌లు పర్ఫెక్ట్‌గా వుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ ఎక్కడో ఏదో భయం వారిని వెంటాడుతోంది. రామాయణాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించారా.. లేక కల్పితాలు ఏమైనా వున్నాయా అన్న అనుమానం కొందరిలో కలిగింది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌కి మరో సమస్య ఎదురైంది. ఈ సినిమాపై కొందరు సనాతన ప్రచారకర్తలు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఆదిపురుష్‌ను రిలీజ్ చేయడానికి కంటే ముందే తాము చూడాలని కోరారు. సనాతన్ ఘర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తీవారీ, బాంబే హైకోర్ట్ న్యాయవాది ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తమ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, ఆదిపురుష్ చిత్ర యూనిట్ గతంలో కొన్ని తప్పులు చేసిందని అలాంటివి సినిమాలో వుంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి దీనిపై సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

జూన్ 16న ప్రేక్షకుల ముందుకు ఆదిపురుష్ :

ఇకపోతే.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు. జూన్ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.