close
Choose your channels

Revanth Reddy: ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..

Monday, February 19, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Revanth Reddy: ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. టీ కొట్టులు, కటింగ్ షాపులు, హోటల్స్‌లో ఏ ఇద్దరు కలిసినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉందని మాట్లాడుకుంటున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల నియామకం కావడంతో కాంగ్రెస్ పార్టీలోనూ కొంతమేర కదలిక వచ్చిందనుకుంటున్నారు. అయితే ఇప్పటికప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని కూడా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీ పవర్‌లో ఉంది. దీంతో ఏపీలోనూ పాగా వేయాలని డిసైడ్ అయింది.

ఇప్పటికే షర్మిల అధికార వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేస్తున్నారు. అయితే కుమారుడి పెళ్లి ఉండటంతో కొన్ని రోజులు ప్రచారానికి గ్యాప్ ఇచ్చారు. కుమారుడి పెళ్లికి ముందు హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. అంతకుముందు సోనియా గాంధీతో భేటీ అయి ఏపీలో పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలపై చర్చించారు. ఇందుకు ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలను బరిలోకి దింపేందుకు సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఆ వెంటనే రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రేవంత్‌ను ఆహ్వానించారు. ఇందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Revanth Reddy: ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..

రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రకటించారు. త్వరలోనే బహిరంగసభలు ఏర్పాటు చేస్తామని.. ఈ సభలకు రేవంత్‌తో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర జాతీయ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. వాస్తవంగా రేవంత్ రెడ్డికి తెలంగాణతో పాటు ఏపీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయనను ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. మంచి వాక్చాతుర్యం ఉన్న షర్మిలకు రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ కూడా తోడైతే కాంగ్రెస్ నుంచి దూరమైన వర్గాలు మళ్లీ తిరిగి రావడం ఖాయమనే ఆలోచనలో ఉన్నారు.

అయితే చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది. రాష్ట్ర విభజనం అనంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కానీ నేటి వరకు చంద్రబాబు మీద టీడీపీ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో రేవంత్ పట్ల మంచి ఇమేజ్ ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిందనే వాదన ఉంది.

Revanth Reddy: ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..

ఇదిలా ఉంటే ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా అయ్యాక కనీసం పక్క రాష్ట్ర సీఎం జగన్ శుభాకాంక్షలు కూడా తెలపలేదని వెల్లడించారు. తన గురువు కేసీఆర్‌ను ఓడించాను కాబట్టి తాను సీఎం కావడం జగన్‌కు ఇష్టం లేదని తెలిపారు. అలాగే కచ్చితంగా షర్మిలకు తన వంతు మద్దతు ఇస్తానని స్పష్టంచేశారు. దీంతో సీఎం జగన్‌పై రేవంత్ విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు మీద విమర్శలు చేస్తారా.. లేదంటే అధికార వైసీపీ మీదనే విమర్శలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.