close
Choose your channels

బాలయ్య, గోపీచంద్ మూవీలో క్రేజీ నటి.. ఈసారి ఆమె రోల్ ఏంటో !

Friday, June 11, 2021 • తెలుగు Comments

బాలయ్య, గోపీచంద్ మూవీలో క్రేజీ నటి.. ఈసారి ఆమె రోల్ ఏంటో !

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గురువారం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రానికి ప్రకటన వచ్చింది. బాలయ్య 107వ చిత్రం ఇది. క్రాక్ బ్లాక్ బస్టర్ తో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని దర్శకుడు కావడంతో అనౌన్స్మెంట్ తోనే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇదీ చదవండి: 'బుట్టబొమ్మ' సాంగ్ కి డాన్స్ కుమ్మేసిన బాలీవుడ్ హీరో.. రీమేక్ లో అతడే..

ఇటీవల కాలంలో బాలయ్యకు బోయపాటిని మినహాయిస్తే ఇతర దర్శకులతో పెద్దగా సక్సెస్ లు లేవు. దీనితో నందమూరి అభిమానులు గోపీచంద్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. గోపీచంద్ కూడా అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటన చేసింది.

బాలయ్య, గోపీచంద్ మూవీలో క్రేజీ నటి.. ఈసారి ఆమె రోల్ ఏంటో !

ఈ చిత్రంలో విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలిపారు. క్రాక్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో అదరగొట్టింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో వరలక్ష్మి తన నటనతో మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే.

బాలయ్య మూవీలో కూడా ఆమె నెగిటివ్ రోల్ లో కనిపిస్తుందేమో చూడాలి. వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ లో లేడి విలన్ రోల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతోంది. సర్కార్ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే.

బాలయ్య 107వ చిత్రం మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతుండగా తమన్ సంగీతం అందించనున్నాడు. ఇతర నటీనటుల్ని త్వరలో ఎంపిక చేస్తారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Get Breaking News Alerts From IndiaGlitz