ధనుష్ 'జగమే తందిరం' ట్రైలర్.. శంకర్ దాదా లాగా లండన్ దాదా!


Send us your feedback to audioarticles@vaarta.com


తమిళ హీరో ధనుష్ విజయపరంపర కొనసాగుతోంది. అతడి సినిమాలు తమిళం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం ధనుష్ ఎంచుకుంటున్న కథలే. ఇటీవల ధనుష్ నుంచి వచ్చిన ' కర్ణన్' చిత్రం సెన్సేషన్ సృష్టించింది.
తాజాగా ధనుష్ నుంచి మరో మూవీ రాబోతోంది. అదే కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వం వహించిన 'జగమే తందిరం'. ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటే?
లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలో ధనుష్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ధనుష్ తనదైన శైలిలో ఫన్ జనరేట్ చేస్తూనే యాక్షన్ సీన్స్ లో అదరగొడుతున్నాడు. సంతోష్ నారాయణ్ అందిస్తున్న సంగీతం బావుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని 'జగమే తంత్రం'పేరుతో విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.