close
Choose your channels

ధృవ చూసా చూసా... సాంగ్ ప్రొమో రిలీజ్..!

Saturday, November 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. హిప్ హప్ త‌మిజా సంగీతం అందించిన ధృవ ఆడియోను ఈ నెల 9న మార్కెట్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ చిత్రంలోని చూసా చూసా ఓ హృద‌యాన్ని...క‌లిసా క‌లిసా ఆ హృద‌యాన్ని అనే సాంగ్ ప్రొమోను రిలీజ్ చేసారు. సాంగ్ కు త‌గ్గ‌ట్టు బ్యూటీఫుల్ లోకేష‌న్స్ లో చిత్రీక‌రించిన ఈ సాంగ్ ఖ‌చ్చితంగా హిట్ సాంగ్ గా నిలుస్తుంది అనిపిస్తుంది. ఈ భారీ చిత్రం ధృవ డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.