close
Choose your channels

పాక్ పేప‌ర్‌లో వ‌చ్చేస్తుంద‌ని క‌ల‌గంటానా..?

Monday, March 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాక్ పేప‌ర్‌లో వ‌చ్చేస్తుంద‌ని క‌ల‌గంటానా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన యుద్ధం మాటలు పాక్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై పవన్ మాట్లాడుతూ.. "మీడియాలో నేను ఏదైనా మంచి మాట మాట్లాడితే చూపించ‌రు. నేన‌న్న మాట‌ని మిస్ ఇంట్రప్ట్ చేసి మాత్రం ప‌దే ప‌దే చూపిస్తూ ఉంటారు. భ‌గ‌త్‌సింగ్ గురించి మాట్లాడిన‌ప్పుడు నేన‌న్నది ఏంటి? మీరు చూపించింది ఏంటి.? నేను ఆళ్లగ‌డ్డలో ఒక మాట మాట్లాడితే పాకిస్థాన్ పేప‌ర్‌లో వ‌చ్చేస్తుంద‌ని క‌ల‌గంటానా.? అది ప‌ట్టుకుని మీరు మా దేశ‌భక్తిని శంకిస్తారా? టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీల స‌భ‌ల్లో ఏనాడైనా జాతీయ జెండాలు క‌న‌బ‌డిన దాఖ‌లాలు ఉన్నాయా.? ఆ పార్టీ నాయ‌కులు ఏనాడైనా జాతీయ జెండా ప‌ట్టుకున్నారా? వాళ్ళా మా దేశ‌భ‌క్తి గురించి మాట్లాడేది. జ‌న‌సేన పార్టీ మీటింగుల్లో మాత్ర‌మే జాతీయ జెండాలు క‌న‌బ‌డ‌తాయన్న విష‌యం గుర్తుంచుకోండి. ఏ రోజునా నా దేశ‌భ‌క్తిని మీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు" అని తనపై విమర్శలు గుప్పించిన.. తన గురించి పదే పదే మీడియాల్లో వక్రకరించి చూపిస్తున్న మీడియా సంస్థలపై పవన్ కన్నెర్రజేశారు.

జీవీఎల్‌కు మరోసారి...

"బీజేపీ అధికార ప్రతినిధి మ‌న గురించి మాట్లాడుతున్నారు. ఆయ‌న కారు ఇద్దరు వ్యక్తుల్ని గుద్దేసి, అందులో ఒక‌రు మృతి చెందితే ఆగకుండా మరో కారులో వెళ్లిపోయిన వ్యక్తి. అలాంటి మాన‌వ‌త్వం లేని వ్యక్తా నా గురించి మాట్లాడేది. 1997లోనే తెలంగాణ వ‌చ్చేస్తుంద‌న్నారు. 2014లో తెలంగాణ వ‌స్తుంద‌ని వారికి ఏమైనా ముందే తెలుసా.? నోట్ల ర‌ద్దు గురించి బ్యాంక‌ర్లు ముందుగానే చెప్పేశారు. 2014 ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రిగానే, ప్రధాన మంత్రి గారు, నేను క‌లిసి తిరుగుతున్న సంద‌ర్బంలో అవినీతి నిర్మూల‌నకి పెద్ద నోట్లు ర‌ద్దు చేయాల‌న్న మాట వ‌చ్చింది. అలా అని అంతా ముందే ప్లానింగ్ చేసిన‌ట్టా. ఉగ్రవాదులు ఉన్నారు. దేశ స‌మ‌గ్రత‌ని దెబ్బతీసే వ్యక్తులు ఉన్నారు. దేశ అంత‌ర్గత స‌మ‌గ్రత‌ని నిలువ‌రించే వ్యక్తులు ఉన్నారు. వారిని నిలువ‌రించ‌డం దేశ‌భ‌క్తి కాదా.?" అని జీవీఎల్‌‌పై జనసేనాని ప్రశ్నల వర్షం కురిపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.