close
Choose your channels

.....తెలుసుకోకుండా సినిమా తీసేంత పిచ్చివాడిని కాదు నేను - క్రిష్

Monday, January 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చారిత్రాత్మ‌క చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లే కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ మీడియాతో త‌న సంతోషాన్ని పంచుకున్నారు.

ఫ‌స్ట్ కాంప్లిమెంట్..!

ఫిలిం ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో క్రిష్ మాట్లాడుతూ....గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ కాంప్లిమెంట్ బాల‌య్య ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చింది. బాల‌య్య‌తో క‌లిసి సినిమా చూస్తున్న‌ప్పుడు ఆయ‌న సినిమా చాలా బాగుంది అంటూ అభినందించారు. నాపై ఆయ‌న పెట్టిన న‌మ్మ‌కం నిజం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. ఆత‌ర్వాత మా అమ్మ‌, నా భార్య ర‌మ్య సినిమా చూసారు. సినిమా పూర్త‌వ్వ‌కుండానే ఇంట‌ర్వెల్ లోనే ఫోన్ చేసి చాలా ఎక్సైట్ అవుతూ మాట్లాడారు. బాల‌య్య‌, నా భార్య ర‌మ్య ఇచ్చిన కాంప్లిమెంట్స్ గ్రేట్ కాంప్లిమెంట్స్ ..!

బాల‌య్య త‌ప్ప ఎవ‌రూ చేయ‌లేరు..!

ఈ సినిమాకి బాల‌య్య కాకుండా వేరే హీరో ఎవ‌ర్నీ ఊహించ‌కోలేదు. క‌థే క‌థానాయ‌కుడును కోరుకుంటుంది. ఈ పాత్ర‌ను బాల‌య్య త‌ప్ప ఎవ‌రూ చేయ‌లేరు. బాల‌య్య 100వ సినిమా ఎలా తీస్తామో అని ఎప్పుడూ భ‌య‌ప‌డలేదు. బాల‌య్య 100వ సినిమా చేసే అవ‌కాశం నాకు రావ‌డంతో మ‌రింత బాధ్య‌త‌గా ఈ సినిమా తీసాను.

ఆ విమ‌ర్శ‌లు బాధ క‌లిగిస్తున్నాయి..!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి గురించి చాలా త‌క్కువ స‌మాచారం మాత్రమే ల‌భించింది. 5 పుస్త‌కాలు చ‌దివితే అందులో 10 డిఫ‌రెంట్ వెర్సెన్స్ ఉన్నాయి. దీనికి తోడు నేను చిన్న‌ప్పుడు చ‌దువుకున్న క‌థ, నాకు ల‌భించిన స‌మాచారం అంతా క‌లిపి క‌థ‌గా త‌యారు చేసాం. అయితే...కొంత మంది గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తెలుగు వాడు కాదు అంటున్నారు. నేను దీని గురించి డిష్క‌స‌న్ పెట్ట‌ద‌ల‌చుకోలేదు. విశ్వ‌నాధ స‌త్య‌నారాయ‌ణ శాస్ర్తి గారు చెప్పింది త‌ప్పు అంటారా..? ప‌ర‌బ్ర‌హ్మ శాస్త్రి గారు చెప్పింది త‌ప్పు అంటారా..? ఎన్టీఆర్ ఈ సినిమా చేయాలి అనుకున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తెలుగోడు కాక‌పోతే ఆయ‌న ఎందుకు చేయాలి అనుకుంటారు..? తెలుసుకోకుండా ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తుంటే బాధగా ఉంటుంది. ఏమీ తెలుసుకోకుండా సినిమా తీసేంత పిచ్చివాడిని కాదు నేను.

స‌మిష్టి కృషి..!

79 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేసాను. చారిత్రాత్మ‌క చిత్రాన్ని 79 రోజుల్లో ఎలా తీయ‌గ‌లిగారు అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ నుంచి ప‌క్కా ప్లాన్ తో వ‌ర్క్ చేసాం. మొరాకో, అమ‌రావ‌తి, గ్రీకు...ఇలా మూడు యుద్ద స‌న్నివేశాల‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ఎడిట్ చేయ‌డానికి ముగ్గురు ఎడిట‌ర్స్ వ‌ర్క్ చేసారు. కంచె సినిమాకి వ‌ర్క్ చేసిన టీమే ఈ సినిమాకి వ‌ర్క్ చేసారు. ప్ర‌తి ఒక్క‌రు సొంత సినిమాలా వ‌ర్క్ చేయ‌డం వ‌ల‌నే మా క‌ల విజ‌య‌వంతం అయ్యింది.

విజిల్ వేయ‌కుండా ఉండ‌లేక‌పోయాను..!

ఈ సినిమాలో బాల‌య్య‌తో తొడ కొట్టించ‌డం అది కూడా సంద‌ర్భానుసారంగానే ఉంటుంది. ఈ సీన్ వ‌చ్చిన‌ప్పుడు థియేట‌ర్స్ లో మేము ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సీన్ చూస్తున్న‌ప్పుడు నేను థియేట‌ర్ లో విజిల్ వేయ‌కుండా ఉండ‌లేక‌పోయాను. నేను ఈ క‌థ బాల‌య్య చేస్తే బాగుంటుంది అని ఫ‌స్ట్ కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావు గారికి ఫోన్ చేసి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి క‌థ బాల‌య్య‌తో చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాను. వెంట‌నే ఆయ‌న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి గురించి నాకు తెలుసు నేను బాల‌య్య‌తో మాట్లాడ‌తాను అన్నారు. నెక్ట్స్ డే క‌ధ వింటాను అన్నారు ర‌మ్మ‌ని ఫోన్ వ‌చ్చింది. ప‌క్కా ప్లాన్ తో ఏం చేయాలి అనుకుంటున్నామో వివ‌రించాను ఓకే అన్నారు. బాల‌కృష్ణ గారు చెప్పిన‌ట్టు పంచ భూతాలు స‌హ‌క‌రించాయి.

ఇండ‌స్ట్రీ నుంచి అభినంద‌న‌లు..!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చూసి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంక‌టేష్ గారు, మ‌హేష్‌, ఎన్టీఆర్, నితిన్, రామ్, దాస‌రి నారాయ‌ణ‌రావు గారు, రాఘ‌వేంద్ర‌రావు గారు, సుకుమార్, ద‌శ‌ర‌థ్, కె.ఎస్.రామారావు, అశ్వ‌నీద‌త్...ఇలా ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అంద‌రూ ఫోన్ చేసి అభినందించారు. అంద‌రితో సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. వెంక‌టేష్ 75వ సినిమా చేస్తున్నాను. మ‌హేష్ తో శివ‌మ్ అని ఓ సినిమా అనుకున్నాం కానీ కుద‌ర‌లేదు. మ‌హేష్ తో వేరే ప్రాజెక్ట్ చేస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.