close
Choose your channels

'డిస్కోరాజా' ఇంట్రడక్షన్ సాంగ్ ఢిల్లీవాలాకు అమేజింగ్ రెస్పాన్ !!!

Saturday, December 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డిస్కోరాజా ఇంట్రడక్షన్ సాంగ్ ఢిల్లీవాలాకు అమేజింగ్ రెస్పాన్ !!!

వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 'డిస్కోరాజా' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఢిల్లీవాలా..’ అనే గీతాన్ని ఈరోజు (డిసెంబర్ 20) విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియర్ పాడడం జరిగింది. హీరో పరిచయ గీతంగా విడుదలైన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్ తనదైన శైలిలో మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కార్తీక్‌ ఘట్టమనేని, సంభాషణలు అబ్బూరి రవి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.