close
Choose your channels

బెల్ గ్రేడ్ లో 'డ్యూయెట్'....

Tuesday, December 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ, అదితిరావు హైద‌రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `డ్యూయెట్‌`( త‌మిళంలో కాట్రు వెలియిడు). ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మార్చిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌ర‌గుతున్నాయి. ప్ర‌స్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని సాంగ్స్ చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటుంది. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఇప్పుడు యూనిట్ బెల్‌గ్రేడ్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ ఆర్మీ ఫైల‌ట్‌లా న‌టిస్తున్నాడు. ఓకే బంగారం వంటి స‌క్సెస్‌ త‌ర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మ‌రో ల‌వ్ స్టోరి ఇది. సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.